ప్రభాస్ బాటలోనే సాయిధరమ్ కూడా వెళతాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
సాయి ధరమ్ తేజ్ హీరోగా, యూత్‌ఫుల్ చిత్రాల దర్శకుడు ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు.
జూన్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. 2016లో విడుదలైన ‘సుప్రీమ్’తో ఆఖరిసారిగా విజయాన్ని అందుకున్నారు తేజు. ఆ తర్వాత వచ్చిన 'తిక్క', 'విన్నర్', 'నక్షత్రం', 'జవాన్', 'ఇంటిలిజెంట్'తో వరుసగా ఐదు పరాజయాలు చవి చూసారు.
ఈ నేపథ్యంలో కరుణాకరన్ సినిమాపైనే తన ఆశలు పెట్టుకున్నారు తేజు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. గతంలో ఇలాగే వరుస ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్‌కి కరుణాకరన్ సినిమాతోనే విజయం దక్కింది.
ఆ వివరాల్లోకి వెళితే.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఛత్రపతి'తో కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్న ప్రభాస్‌కు.. ఆ తర్వాత చేసిన 'పౌర్ణమి', 'యోగి', 'మున్నా', 'బుజ్జిగాడు', 'బిల్లా', 'ఏక్ నిరంజన్' చిత్రాలు ఆశించినంత విజయాన్ని అందించలేకపోయాయి. ఈ నేపథ్యంలో కరుణాకరన్‌తో 'డార్లింగ్' సినిమా చేశారు. వరుసగా ఆరు ఫ్లాపుల తర్వాత 'డార్లింగ్'తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు ప్రభాస్. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం పడలేదు. మరి ప్రభాస్ లాగే తేజు కూడా కరుణాకరన్ సినిమాతో విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments