కృష్ణవంశీ సినిమాలో... మెగా హీరో..!
Sunday, August 7, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ నక్షత్రం అనే చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సందీప్ కిషన్, రెజీనా జంటగా నటిస్తున్నారు. శ్రీచక్ర మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే...ఈ చిత్రంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ పవర్ ఫుల్ పోలీస్ గా నటిస్తున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా కృష్ణవంశీ తెలియచేస్తూ... నక్షత్రంలో మరో తార మెరవనున్నారు. నా యంగ్ ఫ్రెండ్ సాయిధరమ్ తేజ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్ర చేయనున్నాడు. త్వరలో తేజు పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం అని తెలిపారు. పోలీస్ స్టోరీ కధాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments