కృష్ణవంశీ సినిమాలో... మెగా హీరో..!

  • IndiaGlitz, [Sunday,August 07 2016]

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ న‌క్ష‌త్రం అనే చిత్రం తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో సందీప్ కిష‌న్, రెజీనా జంట‌గా న‌టిస్తున్నారు. శ్రీచ‌క్ర మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇదిలా ఉంటే...ఈ చిత్రంలో మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ గా న‌టిస్తున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా కృష్ణ‌వంశీ తెలియ‌చేస్తూ... న‌క్ష‌త్రంలో మ‌రో తార మెర‌వ‌నున్నారు. నా యంగ్ ఫ్రెండ్ సాయిధ‌ర‌మ్ తేజ్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ పాత్ర చేయ‌నున్నాడు. త్వ‌ర‌లో తేజు పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తాం అని తెలిపారు. పోలీస్ స్టోరీ క‌ధాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

More News

మంచు లక్ష్మి క్లాప్ తో ప్రారంభమైన మంచు మనోజ్ కొత్త సినిమా

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా ‘నా రాకుమారుడు’ చిత్ర దర్శకుడు S.K. సత్య దర్శకత్వంలో రూపొందుతున్న నూతన చిత్రానికీ సంబధించి

మంత్రి పద్మారావు చేతుల మీదుగా 'నారదుడు' పాటల విడుదల

ధనుష్-జెనీలియా-శ్రియ జంటగా..జవహర్ దర్శకత్వంలో తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో 'నారదుడు'

చిరుకు థ్యాంక్స్ తెలియచేసిన శ్రీరస్తు శుభమస్తు టీమ్..

అల్లు శిరీష్-లావణ్య జంటగా పరుశురామ్ తెరకెక్కించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు.

మమ్మల్ని కామెంట్ చేసిన వాళ్లకు అదే సమాధానం - హీరో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ,రీతూవర్మ జంటగా నూతన దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన విభిన్న కథాచిత్రం పెళ్లిచూపులు. ఈ చిత్రాన్ని రాజ్ కందుకూరి,యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు.

నంద‌మూరి హీరో - మెగా హీరో భారీ మ‌ల్టీస్టార‌ర్ ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఇజం చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 29న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.