క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో సాయిధరమ్ చిత్రం?
Send us your feedback to audioarticles@vaarta.com
మానవతా విలువలు గల సినిమాలను తెరపై ఆవిష్కరించడంలోనూ.. ఉత్కంఠభరితమైన మూవీలను తెరకెక్కించడంలోనూ.. ప్రయోగాత్మక చిత్రాలను రూపొందించడంలోనూ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి సిద్ధహస్తుడు.
చక్కటి కథ, కథనంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఈ దర్శకుడి శైలి. ఇందుకు ఉదాహరణే ఆయన గత చిత్రాలు 'ఐతే', 'అనుకోకుండా ఒక రోజు', 'ఒక్కడున్నాడు', 'సాహసం', 'మనమంతా'. ఇలా వైవిధ్యమైన కథలతో సినిమాలను చేసి విజయాలతో సంబంధం లేకుండా.. ప్రేక్షకుల మదిలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఈ టాలెంటెడ్ డైరెక్టర్.
ఇదిలా ఉంటే.. చంద్రశేఖర్ యేలేటి తన తదుపరి చిత్రాన్ని సాయిధరమ్ తేజ్ తో చేయనున్నారని సమాచారం. ఇప్పటికే సాయిధరమ్ కోసం ఓ క్రైమ్ థ్రిల్లర్ ను చంద్రశేఖర్ ఏలేటి సిద్ధం చేశారని ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.
ఈ సినిమాలో చంద్రశేఖర్ మార్క్‌తో సాయిధరమ్ ను కొత్తగా చూపించబోతున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా వుంటే.. ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో సాయి నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత చంద్రశేఖర్ ఏలేటి ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments