సాయిధరమ్ తేజ్ బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ రిలీజ్..!
Friday, October 14, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
రేయ్, పిల్లానువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ చిత్రాలతో సక్సెస్ సాధించిన యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. తాజాగా సాయిధరమ్ తేజ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే...అక్టోబర్ 15న సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు.
ఈ సందర్భంగా ఈరోజు రాత్రి 12 గంటలకు ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ ఫ్యాషన్ మ్యాగజైన్ ఎడిటర్ గా కనిపిస్తాడని సమాచారం. ఈ మూవీలో తన లుక్ కోసం తేజు ముంబాయి వెళ్లి మేకోవర్ చేయించుకున్నాడని తెలిసింది. తనదైన ఏక్టింగ్ & డ్యాన్స్ తో యూత్ ను బాగా ఆకట్టుకుంటున్న సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్...ఈ మూవీతో సక్సెస్ సాధిస్తాడని ఆశిస్తూ హ్యాపీ బర్త్ డే & ఆల్ ది బెస్ట్ టు సాయిధరమ్ తేజ్..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments