Sai Tej: పెళ్లి ఎందుకు చేసుకున్నావ్ రా..? వరుణ్‌పై సాయిధరమ్ తేజ్ ఫైర్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల మ్యారేజ్ ఇటీవల గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకలకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. నవంబర్ 1న ఇటలీలో విహహం జరగ్గా.. నవంబర్ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్ జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ షేర్ చేసి ఓ ఫొటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇందులో పెళ్లి వేదిక వద్దకు వరుణ్ కారులో వెళ్తుంటే తేజ్ మధ్యలో ఆపేశాడు. కారు మీద కాలు పెట్టి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావ్ అంటూ సరదాగా ప్రశ్నిస్తున్నట్లు ఉంది. ఈ ఫొటోలకు ఎందుకు? క్యో? వై? ఎన్? ఎంత పనిచేశావ్ రా వరుణ్ బాబు.. ష్ష్ష్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్ మీద నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. సోలో బతుకే సో బెటర్ అన్నా.. మనం ఇలాగే ఉండిపోదామంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే సాయిధరమ్.. ఇటీవల 'విరూపాక్ష' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. తాజాగ సంపత్ నంది దర్శకత్వంలో 'గంజా శంకర్' చిత్రంలో నటిస్తున్నారు. వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' చిత్రంలో నటించారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout