అలా చేస్తే త‌ప్పేంటి అంటున్న సాయిథ‌ర‌మ్ తేజ్

  • IndiaGlitz, [Monday,September 21 2015]

రేయ్, పిల్లా నువ్వులేని జీవితం...చిత్రాల‌తో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యంగ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్. హారీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సాయిథ‌ర‌మ్ తేజ్ న‌టించిన చిత్రం సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఈ నెల 24న సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. అస‌లు మ్యాట‌ర్ ఏమిటంటే....పిల్లా నువ్వులేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ ఈ రెండు సినిమాల‌ను దిల్ రాజే నిర్మించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు సాయిథ‌ర‌మ్ తేజ్ తో రెండు సినిమాల‌ను నిర్మించిన దిల్ రాజు మ‌రో రెండు సినిమాల‌ను తేజ్ తో ప్లాన్ చేస్తున్నారు. అందులో ఒక‌టి ప‌టాస్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, రైట‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ వేగేశ్నస‌తీష్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో చిత్రం. వ‌రుస‌గా ఒకే సంస్థ‌లో సినిమాలు చేస్తున్నారు. కార‌ణం ఏమిటి అని అడిగితే...మంచి క‌థ‌ల‌తో వ‌స్తున్నారు. పైగా మంచి రెమ్యూన‌రేష‌న్ ఇస్తున్నారు. అలాంట‌ప్పుడు ఒకే సంస్థ‌లో వ‌రుస‌గా సినిమాలు చేస్తే త‌ప్పేంటి అని ఎదురు ప్ర‌శ్నిస్తున్నాడు.తేజు..మామూలోడు కాదు..