'విన్నర్ ' గా మహాశివరాత్రికి వస్తున్న సాయిధరమ్ తేజ్

  • IndiaGlitz, [Saturday,October 15 2016]

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా తెర‌కెక్కుతున్న తాజా చిత్రానికి టైటిల్‌ను ఖ‌రారు చేశారు. శ‌నివారం ఆయ‌న పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని 'విన్న‌ర్‌' అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేసింది. ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై 'విన్న‌ర్‌' రూపొందుతోంది. బేబి భ‌వ్య స‌మ‌ర్పిస్తున్నారు. న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ '' త‌నకు జ‌న్మ‌నిచ్చిన తండ్రిని, మ‌న‌సిచ్చిన అమ్మాయిని గెలవ‌డం కోసం ఓ యువ‌కుడు చేసిన పోరాట‌మే ఈ సినిమా. 'విన్న‌ర్' అనే టైటిల్ చ‌క్క‌గా స‌రిపోతుంద‌ని పెట్టాం. మా హీరో పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టైటిల్‌ని ప్ర‌క‌టించ‌డం, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. త‌మ‌న్ చాలా మంచి సంగీతాన్నిస్తున్నారు. ఐదు పాట‌లు, ఒక బిట్ సాంగ్ ఉంటాయి. అన్ని వ‌ర్గాల వారికీ న‌చ్చేలా సినిమాను తీర్చిదిద్దుతున్నాం'' అని అన్నారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ '' మా హీరో ఎప్పుడూ చాలా పాజిటివ్‌గా ఉంటారు. ఆయ‌న‌కు త‌గ్గ‌ట్టే 'విన్న‌ర్' అనే టైటిల్ కుదిరింది. క‌థానుగుణంగా ఉండే టైటిల్ ఇది. ఇప్ప‌టికే కొంత భాగాన్ని చిత్రీక‌రించాం. ఈ నెల 17 నుంచి 28 వ‌ర‌కు హైద‌రాబాద్‌లో ఒక షెడ్యూల్ చేస్తాం. న‌వంబ‌ర్ 3 నుంచి 22 వ‌ర‌కు ఫారిన్‌లో మ‌రో షెడ్యూల్ ఉంటుంది. ఉక్రెయిన్‌లో పాట‌ల్ని, ఇస్తాంబుల్‌లో క్లైమాక్స్ ని చిత్రీక‌రిస్తాం. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 24న చిత్రాన్ని విడుద‌ల చేస్తాం. సినిమాలోని ప్ర‌తి ఫ్రేమూ గ్రాండ్‌గా ఉంటుంది. సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట చ‌క్క‌గా కుదిరింది. త‌మ‌న్ మంచి బాణీల‌నిస్తున్నారు. అబ్బూరి ర‌వి, శ్రీధ‌ర్ సీపాన ర‌చ‌న ఆక‌ట్టుకుంటుంది. వెలిగొండ శ్రీనివాస్ మంచి క‌థ‌నిచ్చారు'' అని తెలిపారు.

సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, ముకేష్ రుషి, అలి, వెన్నెల‌కిశోర్ త‌దిత‌రులు ఇతర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా.కె.నాయుడు, సంగీతం: త‌మ‌న్‌, ఎడిటింగ్‌: ప్ర‌వీణ్‌పూడి, ఆర్ట్: ప్ర‌కాష్‌, ఫైట్స్: ర‌వివ‌ర్మ‌, క‌థ‌: వెలిగొండ శ్రీనివాస్‌, ర‌చ‌న‌: అబ్బూరి ర‌వి, శ్రీధ‌ర్ సీపాన‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గోపీచంద్ మ‌లినేని.

More News

తేజు కి బర్త్ డే విషెస్ చెబుతూ నక్షత్రం టీమ్ స్పెషల్ వీడియో..!

మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ పుట్టినరోజు ఈరోజు.

బ‌న్ని - వ‌క్కంతం మూవీ డీటైల్స్..!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో డి.జె. దువ్వాడ‌ జ‌గ‌న్నాథ‌మ్ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం త‌ర్వాత బ‌న్ని త‌మిళ డైరెక్ట‌ర్ లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.

ఓ రంగుల చిలుక...పాటకు వస్తున్న స్పందనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా -వర్ధమాన గాయని స్పందన

జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలో తాను పాడిన ఓ రంగుల చిలుక... పాటకు వస్తున్న స్పందన తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నదని, సింగర్ గా తనన కెరీర్ కి ఈ పాట టర్నింగ్ పాయింట్ అవుతుందని తాను భావిస్తున్నానని వర్ధమాన గాయని స్పందన చెబుతోంది.

తేజు విన్న‌ర్ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది..!

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఠాగూర్ మ‌ధు, న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రంగం రేంజ్ లో విజయం సాధించే రంగం-2 -'సోగ్గాడే చిన్ని నాయనా' ఫేం కళ్యాణ్ కృష్ణ

జీవా-తులసీనాయర్ జంటగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి.కె.చంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం రంగం 2. జస్రాజ్ ప్రొడక్షన్స్ సమర్పణలో` శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఎ ఎన్.బాలాజి (సూపర్గుడ్ బాలాజి) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.