నెక్స్‌ట్ గేర్ వేసిన సాయిధ‌ర‌మ్‌

  • IndiaGlitz, [Monday,November 19 2018]

ఆరు వ‌రుస ప్లాప్‌ల త‌ర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా 'చిత్ర‌ల‌హ‌రి' అనే సినిమాను ఇటీవ‌ల లాంచ‌నంగా ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ నేటి నుండి స్టార్ట‌య్యింది. నేను శైల‌జ, ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ చిత్రాల ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌తో పాటు నివేదా పేతురాజ్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ల‌వ్‌, ఎమోష‌న్స్‌, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించే కిషోర్ తిరుమ‌ల అలాంటి క‌థ‌నే మ‌రోసారి తెర‌కెక్కిస్తున్న‌ట్లు స‌మాచారం. మొన్న‌టి వ‌ర‌కు యు.ఎస్ వెళ్లి లుక్స్ విష‌యంలో కేర్ తీసుకుని సినిమాను లాంఛ‌నంగా ప్రారంభించిన సాయిధ‌ర‌మ్ తేజ్ రెగ్యుల‌ర్ షూట్‌తో నెక్ట్స్ గేర్‌కు వెళ్లాడు.

ఈ సినిమా స‌క్సెస్‌ పై సాయిధ‌ర‌మ్ చాలా న‌మ్మ‌కంగా ఉన్నాడు. మ‌రి చిత్ర‌ల‌హ‌రి సాయిధ‌ర‌మ్‌కు ఎలాంటి స‌క్సెస్ ఇస్తుందో చూడాలంటే వ‌చ్చే ఏడాది ఏప్రిల్ వ‌ర‌కు ఆగాల్సిందే.