Sai Dharam Tej: కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన మెగా హీరో.. పేరు కూడా మార్చుకున్నాడు

  • IndiaGlitz, [Saturday,March 09 2024]

మెగా మేనల్లుడు సాయి థరమ్ తేజ్.. హీరోగా కాకుండా మరో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. నిర్మాతగా ప్రొడక్షన్ హౌస్ లాంఛ్ చేశాడు. తన తల్లి విజయదుర్గ పేరుతో (Vijay Durga Productions) నూతనంగా ప్రారంభించిన ప్రొడక్షన్ హౌస్‌కు సంబంధించిన లోగోను విడుదల చేశాడు. ఈ మేరకు మేనమామలు చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌ ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

నా మాతృమూర్తి విజయదుర్గ గారికి చిన్న బహుమతిగా ఆమె పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్‌ ప్రారంభించాను. మా మావయ్యలు చిరంజీవి, నాగబాబు, నా గురువు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో దీన్ని ప్రారంభించాను. నా కెరీర్‌ తొలినాళ్లలో నాకు సహకరించిన నిర్మాత దిల్‌రాజు, నా మిత్రులు నవీన్ విజయ్‌కృష్ణ, హర్షిత్ శ్రీ, ‘సత్య’ టీమ్‌తో కలిసి ఈ సంస్థను ప్రారంభించడం సంతోషంగా ఉంది’’ అని తెలిపాడు. దీంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరోవైపు తన పేరును సాయిదుర్గ తేజ్‌గా మార్చుకున్నట్లు వెల్లడించాడు. ఉమెన్స్ డే సంద‌ర్భంగా త‌న త‌ల్లి పేరు దుర్గను తీసుకుని సాయి దుర్గ తేజ్‌(Sai Durga Tej)గా పెట్టుకున్నట్లు తెలిపాడు. తన తల్లి ఎప్పుడూ తనతో ఉంటుందనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు చెప్పాడు. గతంలో కూడా త‌న పేరును మార్చుకున్న సంగతి తెలిసిందే. 2021లో హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి దగ్గర యాక్సిడెంట్ అయిన అనంత‌రం సాయితేజ్ అని పేరు మార్చుకున్నాడు. ఇక తాజాగా మ‌ళ్లీ సాయిదుర్గ తేజ్‌గా ఛేంజ్ చేసుకున్నాడు.

ఇక తేజ్ సినిమాల విషయానికొస్తే గతేడాది పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి 'బ్రో' సినిమాలో నటించాడు. ఈ సినిమా బక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సంపత్‌ నంది దర్శకత్వంలో వ‌స్తున్న 'గాంజా శంకర్‌'లో న‌టిస్తున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో తేజ్‌ను మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త పంథాలో చూపించబోతున్నారట.

More News

Asaduddin Owaisi: రేవంత్ సర్కార్ ఐదేళ్లు అధికారంలో ఉంటుంది.. అసదుద్దీన్ ఒవైసీ భరోసా..

తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నిన్నటి వరకు బీఆర్ఎస్‌తో ఉన్న మజ్లిస్ పార్టీ కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరవుతుంది. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం

TSRTC:టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం..

ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్‌తో కూడిన పీఆర్సీ ఇవ్వనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Chandrababu and Pawan:అమిత్ షాతో ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ.. బీజేపీకి ఎన్ని సీట్లంటే..?

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది.

Siddham: నాలుగో 'సిద్ధం' సభకు భారీ ఏర్పాట్లు.. 15లక్షల మంది వస్తారని అంచనా..

ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉండటంతో పార్టీలు ప్రచారంపై దృష్టిపెట్టాయి.

Mallareddy: మల్కాజిగిరి ఎంపీగా పోటీచేయలేం.. కేసీఆర్‌కు తేల్చి చెప్పేసిన మల్లారెడ్డి..

మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారనే వార్తలపై చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని..