భాయ్ పాత్రలో తేజ్...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా క్యాంప్ హీరో సాయిధరమ్ తేజ్..ప్రస్తుతం మాస్ కమర్షియల్ సినిమాలను చక్కగా తెరకెక్కించగల దర్శకుడు వినాయక్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సి.కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేసేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి నటిస్తున్న ఈ చిత్రానికి 'ఇంటెలిజెంట్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా ఇప్పుడు ధర్మ భాయ్ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారట. మాస్, యాక్షన్ కంటెంట్ పరంగా ధర్మ భాయ్ అనే టైటిల్ అయితే సరిపోతుందని యూనిట్ భావిస్తుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com