సాయిధరమ్ తో అనిరుధ్...

  • IndiaGlitz, [Monday,April 04 2016]

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సుప్రీమ్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందించబోతున్నాడని సమాచారం.

ప్రస్తుతం చిత్రయూనిట్ అనిరుధ్ తో చర్చలు జరతుందట. ఇప్పటి వరకు అనిరుద్ చరణ్ అందరివాడేలే, నితిన్ అ..ఆ సినిమాలకు సంగీతం అందించాల్సింది కానీ కుదరలేదు. ఇప్పుడు సాయిధరమ్ సినిమాకు సంగీతం అందించడానికి ప్రయత్నిస్తాడేమో చూడాలి.