దసరాకి మెగా మూవీ స్టార్ట్...

  • IndiaGlitz, [Wednesday,September 16 2015]

ద‌స‌రాకి మెగా మూవీ స్టార్ట్ అన‌గానే..మెగాస్టార్ మూవీ అనుకుంటే పొర‌పాటే. మ‌రి..ఏ మూవీ అంటారా..? మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిథ‌ర‌మ్ తేజ్ సినిమా. ఈ చిత్రానికి ప‌టాస్ ఫేం అనిల్ రావిపూడి డైరెక్ట‌ర్. దిల్ రాజు నిర్మాత‌. ఈ సినిమా కోస‌మే సుప్రీమ్ అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం.

హారీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సాయిథ‌ర‌మ్ తేజ న‌టించిన సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ సినిమా ఈ నెల 24న రిలీజ్ అవుతుంది. మ‌రో వైపు క‌ళ్యాణ్ రామ్ ఓం చిత్రం డైరెక్ట‌ర్ సునీల్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌ర‌మ్ తేజ్ తిక్క చిత్రంలో న‌టిస్తున్నారు. ద‌స‌రా రోజు అక్టోబ‌ర్ 22న ప్రారంభించే సాయిథ‌ర‌మ్ తేజ్ కొత్త సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ న‌వంబ‌ర్ నుంచి ప్రారంభం కానున్న‌ట్టు స‌మాచారం.