సప్తగిరి ఇంత బాగా డ్యాన్స్‌లు చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు - సాయిధరమ్ తేజ్
Send us your feedback to audioarticles@vaarta.com
కామెడీ కింగ్ సప్తగిరి కథానాయకుడిగా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై లిమిటెడ్ అధినేత డా.రవికిరణ్ మళ్లీ సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎల్ఎల్బి' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కి రెడీ అవుతోంది. బుల్గానిన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియోలోని రెండవ పాటను 'చేతిగాజుల చప్పుడికే మనసే పతంగిలా ఎగిరే' 2వ పాటని సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ రిలీజ్ చేశారు. సురేష్ ఖనిశెట్టి ఈ పాటని రాయగా, మంగళి ఆలపించారు.
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ - ''తిక్క' సినిమా సరిగ్గా ఆడకపోయినా ఆ చిత్రం నుండి 'సప్తగిరి'తో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇద్దరం బాగా క్లోజ్‌గా వుంటాం. లాస్ట్‌టైమ్ 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' సాంగ్స్ విన్నాను. ఇప్పటికీ ఆ పాటలు వింటున్నాను. అంత బాగా ఇష్టం. 'సప్తగిరి ఎల్.ఎల్.బి' చిత్రం టీజర్ చూశాను. చాలా బాగుంది. రెండవ పాట విజువల్‌గా చాలా బాగుంది. బుల్గానియా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సప్తగిరి డ్యాన్స్‌లు అదరగొట్టాడు. ఇంత బాగా చేస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. చాలా అద్భుతంగా ఈ చిత్రంలో డ్యాన్స్‌లు చేశాడు. బుల్గానిన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. నిర్మాత రవికిరణ్గారికి, దర్శకులు చరణ్‌కి టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
హీరో సప్తగిరి మాట్లాడుతూ - ''మా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ మా చిత్రంలోని రెండవ పాటని లాంచ్ చేయడం చాలా హ్యాపీగా వుంది. అడగ్గానే వెంటనే రెస్పాండ్ అయి రెండవ పాటని లాంచ్ చేశారు. ఆయనకి నా థాంక్స్'' అన్నారు.
నిర్మాత డా. రవికిరణ్ మాట్లాడుతూ - ''తేజ్ డెడికేషన్, హార్డ్‌వర్క్ చేస్తూ మంచి సినిమాలు చేస్తున్నారు. ఆయన గురించి సప్తగిరి ఎప్పుడూ చెప్తుంటారు. మా చిత్రంలోని రెండవ పాటని లాంచ్ చేసినందుకు సాయిధరమ్ తేజ్‌కి నా కృతజ్ఞతలు'' అన్నారు.
చిత్ర దర్శకుడు చరణ్ లక్కాకుల మాట్లాడుతూ - '''పిల్లా నువ్వులేని జీవితం' సినిమా ఇరవైసార్లు చూశాను. అప్పట్నుంచీ తేజ్ అంటే నాకు చాలా ఇష్టం. మంచి మనసుతో వచ్చి 'సప్తగిరి ఎల్.ఎల్.బి' చిత్రంలోని రెండవ పాటని లాంచ్ చేశారు. మా టీమ్ తరపున ఆయనకి మా థాంక్స్'' అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments