మా అమ్మ-నాన్న విడిపోవడానికి కారణమిదే: మెగా హీరో

  • IndiaGlitz, [Wednesday,April 24 2019]

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, 'చిత్రలహరి' మూవీ హీరో సాయిధరమ్‌లో ఓ యూట్యూట్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు మెగాభిమానులు, సినీ ప్రియులతో షేర్ చేసుకున్నాడు. ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ, తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలనూ తేజ్ పంచుకున్నాడు.

2011లో అమ్మకు మరో పెళ్లి చేశాం..!

నా తల్లిదండ్రులు పదిహేనేళ్ల క్రితమే విడిపోయారు. అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను. మేం మా అమ్మ వద్దే ఉండిపోయాం. మా నాన్నతో నేను ఇప్పటికీ మాట్లాడుతుంటాను. కానీ.. అప్పుడున్నంత ఫీల్ ఇప్పుడుందని చెప్పలేను. ఆయనకు సినిమా రంగం గురించి పెద్దగా అవగాహనలేదు. తల్లయినా, తండ్రయినా మాకు ఆమే. మా కోసం తన జీవితాన్ని వృథా చేసుకోకుండా ఆమెకూ ఓ తోడు ఉంటే బాగుంటుందని అందరం కలిసి ఆలోచించాం. దీంతో 2011లో అమ్మ మరో పెళ్లి చేసుకున్నారు.

మా పెళ్లిళ్లు అయిపోతే ఆమె ఒంటరితనం ఫీల్ కాకూడదన్నదే ఇలా ఆలోచించాం. మా సవతి తండ్రితో మా సంబంధాలు బాగానే ఉన్నాయి. ఆయన కేర్ హాస్పిటల్లో కంటి డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి. మాకు ఎక్కడా ఇబ్బంది కలిగించేలా ఆయన వ్యవహరించరు... ఇప్పుడు అంతా బాగుంది అని సాయిధరమ్ తేజ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కాగా ఈ విషయం తెలుసుకున్న మెగాభిమానులు సోషల్ మీడియా వేదికగా తేజ్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.

More News

ప్ర‌భాస్‌కు ఊర‌ట‌

రాయ్‌దుర్గ్ ప‌న్మ‌క్త్ గ్రామంలో హీరో ప్ర‌భాస్ కోనుగోలు చేసిన భూమి ప్ర‌భుత్వ భూమి అంటూ.. అధికారులు దానికి తాళాలు వేశారు.

పెళ్లి గురించి హీరోయిన్ ఏం చెప్పిందో తెలుసా!

తెలుగులో హ‌లోతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌. ఈ సినిమా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌కు

షాకిస్తున్న స‌మంత రెమ్యున‌రేష‌న్‌

గ‌త ఏడాది రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి, అభిమ‌న్యుడు చిత్రాల స‌క్సెస్‌లో త‌న వంతు పాత్ర పోషించి అంద‌రితో శ‌భాష్ అనిపించుకుంది స‌మంత‌.

బ‌రువు త‌గ్గుతున్న సాయితేజ్‌

మెగా క్యాంప్ హీరో సాయి తేజ్ రీసెంట్‌గా విడుద‌లైన `చిత్రల‌హ‌రి`తో మంచి స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు.

వైర‌ల్ అవుతోన్న స‌మంత ప‌ర్స‌న‌ల్ ఫోటోలు

స‌మంత అక్కినేని ఆనందానికి అవ‌ధులు లేకుండా ఉన్నాయి. `మ‌జిలీ` సినిమా గురించి ఈ అమ్మ‌డు ప‌డ్డ టెన్ష‌న్ అంతా దూర‌మైపోయింది.