ఈరోజు సాహసం శ్వాసగా సాగిపో ట్రైలర్ రిలీజ్..
Send us your feedback to audioarticles@vaarta.com
నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్నచిత్రం సాహసం శ్వాసగా సాగిపో. తెలుగు, తమిళ్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్టార్ రైటర్ కోన వెంకట్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన మంజిమ మోహన్ నటిస్తుంది. సంగీత సంచలనం ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
రోజు రోజుకి అంచనాలను పెంచేస్తున్న సాహసం శ్వాసగా సాగిపో థియేట్రికల్ ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం 6 గంటలకు హీరో నాగచైతన్య సోషల్ నెట్ వర్కింగ్ ద్వారా రిలీజ్ చేయనున్నారని చిత్ర సమర్పకుడు కోన వెంకట్ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. అలాగే సాహసం శ్వాసగా సాగిపో ధియేట్రికల్ ట్రైలర్ ను అ ఆ థియేటర్స్ లో ప్రదర్శించనున్నారు. ఈ చిత్రం ఆడియోను ఈనెల 17న, ఈ చిత్రాన్ని జులై 15న రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com