చైతు చక్కోరి పాట విడుదల - ఆడియో విడుదల తేదీ ఖరారు..
Thursday, May 26, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్నచిత్రం సాహసం శ్వాసగా సాగిపో. తెలుగు, తమిళ్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్టార్ రైటర్ కోన వెంకట్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన మంజిమ మోహన్ నటిస్తుంది. సంగీత సంచలనం ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రంలోని చక్కోరి అంటూ సాగే పూర్తి పాటను ఈరోజు ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసారు. అలాగే ఈ చిత్రం ఆడియోను జూన్ 17న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని జులై 15న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి.... చైతు - గౌతమ్ మీనన్ ల ఏమాయ చేసావే కాంబినేషన్ ఈసారి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments