ఈ నెల 24న విడుదల కానున్న'సాహసం సేయరా డింభకా'
Send us your feedback to audioarticles@vaarta.com
హంసవాహిని టాకీస్ పతాకంపై తిరుమలశెట్టి కిరణ్ దర్శకత్వంలో ఎమ్.ఎస్.రెడ్డి నిర్మించిన హారర్ కామెడీ చిత్రం 'సాహసం సేయరా డింభకా'. శ్రీ, హమీద, సమత, శకలక శంకర్, ఆలీ, జ్యోతి.జబర్దస్త్ అప్పారావు ప్రధాన పాత్రదారులుగా.. ''ఓ పిరికివాడిని దెయ్యం ప్రేమిస్తే'' అన్న కొత్త కథాంశంతో.. ఆద్యంతం వినోదాత్మకంకా రూపొందించబడ్డ ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. విడుదలకు ముందే ట్రేడ్ లో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఈ నెల 24న 200 కు పైగా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా వుందని నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డి తెలిపారు.
శ్రీవసంత్ సంగీతం అందించిన ఈ చిత్రానికి కెమెరా: యోగి, శివ కె.నాయుడు, సంగీతం: శ్రీవసంత్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, డి.టి.ఎస్: మధుసూదన్ రెడ్డి, ఫైట్స్: వెంకట్, డాన్స్: ఎమ్.ఎన్.రాజు, సౌండ్ ఎఫెక్ట్స్: యతిరాజ్, నిర్మాత: ఎమ్.ఎస్.రెడ్డి, రచన-దర్శకత్వం: తిరుమల శెట్టి కిరణ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com