ముఖానికి ముసుగు, న్యూడ్ గా కనిపించమన్నాడు.. రాజ్ కుంద్రా రాసలీలలు
Send us your feedback to audioarticles@vaarta.com
పోర్న్ ఫిలిమ్స్ మేకింగ్ కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా రాసలీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాజ్ కుంద్రా వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న నటీమణులంతా అతడి రాసలీలల్ని బయట పెడుతున్నారు. సాగరిక సోనా అనే నటి రాజ్ కుంద్రా గురించి వీడియో రూపంలో వివరించిన విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
సాగరిక మోడల్ గా రాణించారు. నటనపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను అని సాగరిక తెలిపింది. రాజ్ కుంద్రా మంచి వాడు కాదంటూ గత ఏడాదే సాగరిక మీడియాకు వివరించింది. అతడిని అరెస్ట్ చేయాలని పేర్కొంది. గత ఏడాది లాక్ డౌన్ టైం లో ఆమె రాజ్ కుంద్రా వల్ల ఇబ్బంది పడ్డట్లు సాగరిక తెలిపింది. ఉమేష్ కామంత్ నుంచి నాకు ఫోన్ వచ్చింది.
రాజ్ కుంద్రా ఓ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నట్లు తెలిపాడు. అందులో తనకు అవకాశం కూడా ఇస్తున్నట్లు, ఆడిషన్స్ కి హాజరు కావాలని కోరాడు. రాజ్ కుంద్రా ఎవరని ప్రశ్నించగా శిల్పా శెట్టి భర్త అని సమాధానం ఇచ్చాడు.
ఈ వెబ్ సిరీస్ లో నటిస్తే నటిగా దూసుకుపోతావని చెప్పాడు. అవకాశం వస్తుంది కదా అని వెబ్ సిరీస్ కు ఒకే చెప్పా. అయితే వెంటనే ఆడిషన్స్ కి రావాలని కోరాడు. కోవిడ్ కారణంగా కుదరలేదు. దీనితో విడియో కాల్ ద్వారా ఆడిషన్స్ అడిగారు. సరే అని చెప్పాను. వీడియో కాల్ లో ముసుగు వేసుకుని ఓ వ్యక్తి కనిపించాడు. అతడితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు.
న్యూడ్ గా ఆడిషన్స్ ఇవ్వాలని అడిగారు. నేను షాక్ అయ్యా. ఇలాంటివి కుదరవని కాల్ నుంచి వెళ్ళిపోయా. ఆ ముసుగు వేసుకున్న వ్యక్తే రాజ్ కుంద్రా అని సాగరిక తెలిపింది.
ఇలా రాజ్ కుంద్రా బాధితులుగా మారిన నటీమణులంతా అతడిని అరెస్ట్ చేసి మంచి పనే చేశారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లండన్ వేదికగా పోర్న్ ఫిలిమ్స్ నిర్మించి వాటిని యాప్స్ ద్వారా ఇండియాలో రిలీజ్ చేస్తున్న కేసులో రాజ్ కుంద్రాని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments