ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది - సాగర్
- IndiaGlitz, [Saturday,September 17 2016]
సాగర్, రాగిణి, సాక్షి చౌదరి హీరో, హీరోయిన్స్ గా దయానందరెడ్డి తెరకెక్కించిన చిత్రం సిద్దార్ధ. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన సిద్దార్ధ చిత్రం ఈనెల 16న రిలీజైంది. తొలిరోజు మంచి కలెక్షన్స్ వసూలు చేసింది అంటూ చిత్ర యూనిట్ సిద్దార్ధ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసారు.
ఈ సందర్భంగా పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...ఏ సినిమా అయినా ఈజీగా సక్సెస్ కాదు. ఈ సినిమా కోసం ఒక సంవత్సరం పాటు హార్డ్ వర్క్ చేసాం. ఈ చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ తో మా ప్రయాణం జీనియస్ సినిమాతో ప్రారంభం అయ్యింది. ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మించారు. డైరెక్టర్ దయానందరెడ్డి పట్టుదల గల మనిషి. ఆర్టిస్టుల నుంచి తనకు కావాల్సిన విధంగా నటన వచ్చే వరకు రాజీపడడు. ప్రేమకథలకు కులం, మతం, అంతస్ధు, పరిస్ధితులు అడ్డుగా నిలుస్తాయి. కానీ..మా సినిమాలో ప్రేమకు అడ్డంగా ఏం నిలిచింది ఏమిటి అనేది కొత్త పాయింట్. విసు చాలా మంచి కథ అందించాడు. టి.వీ లో స్టార్ అయిన సాగర్ ని హీరో చేసే అవకాశం మాకు రావడం ఆనందంగా ఉంది. హీరోయిన్ రాగిణి కూడా పాత్రకు తగ్గట్టు చాలా బాగా నటించింది. ఈ చిత్రం ఇంకా పెద్ద హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర సమర్పకుడు బుచ్చిరెడ్డి మాట్లాడుతూ....చాలా కథలు విన్నప్పటికీ విసు చెప్పిన కథ ఇన్ స్పైర్ చేసింది. మా నిర్మాత కిరణ్ గారు ఎన్నిరోజులైనా మలేషియాలో ఉండండి కానీ హిట్ సినిమా కావాలి అనేవారు. వర్షంలో కూడా మంచి కలెక్షన్స్ అందించిన ఆడియోన్స్ కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
రచయిత విసు మాట్లాడుతూ...మా సిద్దార్ధ ఘన విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. సాగర్ టాప్ 10 హీరోల్లో ఒకడుగా నిలుస్తాడు. ఈ కథ రాసేటప్పుడు పరుచూరి బ్రదర్స్ సలహాలు తీసుకున్నాను. వాళ్లు అందించిన సహకారం మరువలేనిది. నేను చాలా సినిమాలకు వర్క్ చేసినప్పటికీ ఈ సినిమాతో గుర్తింపు వచ్చింది. ఈ కథ పాత కథే అని కొంత మంది అంటున్నారు. కొత్తగా కథలు ఎక్కడా ఉండవు. కథలన్నింటికీ మూలం రామాయణం, మహా భారతాలే అన్నారు.
డైరెక్టర్ దయానందరెడ్డి మాట్లాడుతూ...ఫస్టాఫ్ లో కామెడీ, యాక్షన్ సీన్స్ ను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడే ఈ సినిమా సక్సెస్ అని అర్ధం అయ్యింది. వర్షం పడుతున్నా కలెక్షన్స్ తగ్గలేదు. మణిశర్మ రి రీకార్డింగ్, ఎస్.గోపాలరెడ్డి గారి ఫోటోగ్రఫి, పరుచూరి బ్రదర్స్ సంభాషణలు, విసు కథ...ఇలా టెక్నీషియన్స్ అందరు పూర్తి సహకారం అందించడం వలన ఈ విజయం సాధ్యమైంది అన్నారు.
నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ...బుల్లితెర మెగాస్టార్ సాగర్ ను బిగ్ స్ర్కీన్ పై గ్రాండ్ గా లాంఛ్ చేసాం. ఫస్డ్ డే రోజున 100% హౌస్ ఫుల్ అవ్వడం అనేది భగవంతుడు, ప్రేక్షకుల ఆశీర్వదం వలనే సాధ్యమైంది. ఫస్ట్ డే రోజు 2 లక్షల మంది సినిమా చూసారు. అంతమందిని ఈ సినిమాకి రప్పించడం అనేది సాగర్ పూర్వ జన్మసుకృతం. నెక్ట్స్ వంగవీటి చిత్రాన్ని అందిస్తున్నాను. ఆతర్వాత అన్నయ్య ఓకే అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాను నిర్మిస్తాను అన్నారు.
హీరో సాగర్ మాట్లాడుతూ...ఈ సినిమా చేస్తున్నప్పుడు నాపై నాకు నమ్మకం ఉండేది కానీ...నన్ను నేను ఎక్కువుగా ఊహించుకుంటున్నానా అనే భయం ఉండేది. అయితే నిన్న రిలీజైన ఈ మూవీకి ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు చూపించిన ఆదరణ చూసి ఏమిచ్చి వీళ్ల రుణం తీర్చుకోగలను అనిపించింది. కిరణ్ గారు - నేను ఒక నిర్మాత - హీరో అన్నట్లుగా ఈ సినిమా చేయలేదు. అన్నదమ్ముల్లా ఈ మూవీకి వర్క్ చేసాం. ప్రేమతో వర్క్ చేయడం వలనే ఈ విజయం వచ్చింది అనుకుంటున్నాను. ఈ సక్సెస్ కి కారణమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.