'సడి' షూటింగ్ ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
భాను ఎంటర్టైన్మెంట్స్- `శ్రీ సాయి అమృతలక్ష్మి క్రియేషన్స్ బేనర్స్ పై గోదారి భానుచందర్ నిర్మిస్తోన్న చిత్రం ‘సడి’. పాలిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సుమన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం ఈ రోజు ఫిలింనగర్లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ దర్శకులు వి.సాగర్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా ధవళ సత్యం కెమెరా స్విచాన్ చేశారు. నటుడు, దర్శకుడు గూడ రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు వీర శంకర్ స్ర్కిప్టు అందించారు.
అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నటుడు సుమన్ మాట్లాడుతూ..."ఫ్యామిలీ నేపథ్యంలో సాగే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. కథ నచ్చి నటిస్తున్నాను. నిర్మాతకు సినిమాల పట్ల మంచి ప్యాషన్ ఉంది. దర్శకుడు గతంలో కొరియోగ్రాఫర్ గా చాలా చిత్రాలు చేశాడు.
మంచి కాన్సెప్ట్స్ తో , క్లారిటీతో ఈ సినిమా చేస్తున్నాడు. ప్రతి ఇంటికి ఒక హీరో ఉంటాడు. అది చిన్నవారు కావచ్చు ,పెద్దవారు కావచ్చు..ఆ విధంగా నేను ఈ సినిమాలో ఒక ఇంటికి హీరోగా లీడ్ రోల్ లో నటిస్తున్నా" అన్నారు.
దర్శకుడు పాలిక్ మాట్లాడుతూ..."కొరియోగ్రాఫర్ గా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ చిత్రాలకు పని చేశాను. ఒక చిల్డ్రన్ ఫిల్మ్ కి డైరక్షన్ కూడా చేశాను. 'సడి' నా రెండో సినిమా. నిర్మాత నాతో రెండేళ్లుగా జర్నీ చేస్తున్నారు. ఒక మంచి పాయింట్ తో సినిమా చేద్దామని ఈ సినిమా చేస్తున్నాం.
ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎదుర్కొన్న ఊహించని పరిణామాలే ఈ చిత్రం. మే నెలాఖరులో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేస్తాం. సుమన్ గారికి హండ్రెడ్ పర్సంట్ సరిపోయే పాత్రిది. ఒక ప్రముఖ హీరోయిన్ నటించనున్నారు. త్వరలో ఎవరనేది ప్రకటిస్తాం" అన్నారు.
నిర్మాత గోదారి భానుచందర్ మాట్లాడుతూ..."ఇటీవల కాలంలో మంచి కాన్సెప్ట్స్ తో వచ్చే చిన్న చిత్రాలను ఆదరిస్తున్నారు. ఓ విభిన్న మైన కథాంశంతో 'సడి' చిత్రాన్ని చేస్తున్నాం. సుమన్ గారితో నా తొలి సినిమా నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ఇటీవల 'ఇంతలో ఎన్నెన్ని వింతలో' చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న యాజమాన్య మంచి బాణీలిస్తున్నారు. టాలెంటెడ్ టీమ్ తో ఈ సినిమా చేస్తున్నాం" అన్నారు.
గూడ రామకృష్ణ మాట్లాడుతూ..."కథ విన్నాను...చాలా బావుంది. సుమన్ గారు మాత్రమే చేయగల పాత్ర. నేను కూడా ఈ చిత్రంలో మంచి పాత్రలో నటిస్తున్నా" అన్నారు.
సుమన్, హేమ్ చందర్, అల్లరి సుభాషిణి, ప్రీతి నిగమ్, గూడ రామకృష్ణ, రమేష్ రమ్మి, రఘు, అనిత ఆళ్లపాటి, జబర్దస్త్ అప్పారావు, వేణు, భాస్కర్, కొమరం, ఛైల్డ్ ఆర్టిస్స్ట్ మాస్టర్ కుషల్ కుమార్, బేబి గాయత్రి, బేబి శరణ్య, బేబి శివాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జశ్వంత్, సంగీతం: యాజమాన్య, సాహిత్యం: సురేష్ ఉపాధ్యాయ, గోసాల రాంబాబు ఎడిటర్: నాగిరెడ్డి, స్టిల్స్: ఎన్.రమేష్ కుమార్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, పిఆర్ఓ: చందు రమేష్; నిర్మాత: గోదారి భానుచందర్; కథ, మాటలు, స్క్రీన్ప్లే`దర్శకత్వం:పాలిక్(శ్రీనివాస్ చారి)
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout