టీడీపీకి మరో షాక్.. లేడీ ఫైర్‌బ్రాండ్ గుడ్‌ బై!

  • IndiaGlitz, [Thursday,November 07 2019]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాక్‌లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ అనిపించుకుండే ఒక్క నేతా లేకపోవడం.. ఏపీలోనూ టీడీపీ ఖాళీ అవుతుండటంతో ఉన్న నేతలను అయినా పార్టీని వీడకుండా ఉండేందుకు బాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ అవన్నీ విఫలం అవుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీకి ఒక్కొకరుగా గుడ్ బై చెబుతూ వస్తున్న విషయం విదితమే. ఈ షాక్‌ నుంచి కోలుకోకమునుపే మరో లేడీ ఫైర్ బ్రాండ్ టీడీపీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని వార్త చంద్రబాబును కలవరపెడుతోంది. ఆ ఫైర్‌బ్రాండ్ మరెవరో కాదు.. సాధినేని యామిని. ఈమె గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. వైసీపీకి ఎమ్మెల్యే రోజా ఎలాగో.. టీడీపీ ఈమె అలా అన్న మాట. ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెట్టడంలో.. విమర్శలను తిప్పికొట్టడంలో ఈమె ముందు వరుసలో ఉండేవారు.

బీజేపీ బంపరాఫర్!

ఇప్పటికే టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసిన విషయం విదితమే. ఇప్పటికే ఈ వార్తలను ఆమె ఖండించగా.. అయితే తాజాగా మరోసారి ఆమె రాజీనామా చేస్తారని పుకార్లు వస్తున్నాయి. అంతేకాదు ఈ సారి పక్కాగా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీ ఇతర పార్టీలను ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా, ఆమెను బీజేపీ నేతలు సంప్రదించగా.. తనకు ఏదో ఒక పదవి కట్టెబెట్టాలని కోరిందట. టీడీపీలో ఏ పదవి అయితే ఉందో ఇక్కడ కూడా అదే పదవి ఇస్తామని.. అంతేకాదు.. రానున్న ఎన్నికల్లో కోరుకున్న నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తామని కమలనాథులు హామీ ఇచ్చారని సమాచారం. అంటే యామినీకి బీజేపీ బంపరాఫర్ ఇచ్చింద్న మాట.! అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈనెల 10న అధికారికంగా కమలం పార్టీలో చేరునున్నారని తెలుస్తోంది. దీంతో యామిని టీడీపీకి టాటా చెప్పేసి.. కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమని పెద్ద ఎత్తున టీవీ చానెల్స్, సోషల్ మీడియాలో వార్తలు మొత్తం కోడై కూస్తోంది.

బాబు భారీ షాకే..!

కాగా.. ఈమెకు వైసీపీలో చేరికకు డోర్స్ క్లోజ్ అవ్వడంతో చేసేదేమీ లేక.. టీడీపీలో ఉండలేక బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పార్టీ మార్పుపై సోషల్ మీడియాలో.. టీవీ చానెల్స్‌లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ సీరియస్‌గా ఖండించిన దాఖలాల్లేవ్. అయితే నిజంగానే వీరిద్దరూ పార్టీ మారితే మాత్రం చంద్రబాబుకు ఊహించని షాకేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు.. టీడీపీలో ఇప్పుడు గట్టిగా మీడియా ముందుకొచ్చి వాయిస్ వినిపించే నేతలు అంతంత మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఇలా ఒక్కొక్కరుగా పార్టీకి టాటా చెప్పేయడం టీడీపీ గట్టి ఎదురుదెబ్బేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో మరి.

More News

కన్న‌డలోకి రాజ్‌త‌రుణ్ ఎంట్రీ

మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ ఇప్పుడు తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు.

'పట్నఘఢ్' విడుదలపై స్టే ఇవ్వలేం: సుప్రీం కోర్ట్

అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పలువురు సినీ దిగ్గజాల ప్రశంసలు అందుకున్న దర్శకుడు, ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న 'నా బంగారు తల్లి'

కామెడీతో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న మూవీ 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌' - సుడిగాలి సుధీర్‌

'జబర్దస్త్‌, ఢీ, పోవే పోరా' వంటి సూపర్‌హిట్‌ టెలివిజన్‌ షోస్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా, 'రాజుగారి గది'

అట్టహాసంగా 'దర్బార్' మోషన్ పోస్టర్

సూపర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `ద‌ర్బార్‌`.

బాలయ్యకు విలన్‌గా మారుతున్న బాలీవుడ్ స్టార్‌?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.