టీడీపీకి మరో షాక్.. లేడీ ఫైర్‌బ్రాండ్ గుడ్ బై!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాక్‌లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ అనిపించుకుండే ఒక్క నేతా లేకపోవడం.. ఏపీలోనూ టీడీపీ ఖాళీ అవుతుండటంతో ఉన్న నేతలను అయినా పార్టీని వీడకుండా ఉండేందుకు బాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ అవన్నీ విఫలం అవుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీకి ఒక్కొకరుగా గుడ్ బై చెబుతూ వస్తున్న విషయం విదితమే. ఈ షాక్ నుంచి కోలుకోకమునుపే మరో లేడీ ఫైర్ బ్రాండ్ టీడీపీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని వార్త చంద్రబాబును కలవరపెడుతోంది. ఆ ఫైర్‌బ్రాండ్ మరెవరో కాదు.. సాధినేని యామిని. ఈమె గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. వైసీపీకి ఎమ్మెల్యే రోజా ఎలాగో.. టీడీపీ ఈమె అలా అన్న మాట. ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెట్టడంలో.. విమర్శలను తిప్పికొట్టడంలో ఈమె ముందు వరుసలో ఉండేవారు.
బీజేపీ బంపరాఫర్!
ఇప్పటికే టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసిన విషయం విదితమే. ఇప్పటికే ఈ వార్తలను ఆమె ఖండించగా.. అయితే తాజాగా మరోసారి ఆమె రాజీనామా చేస్తారని పుకార్లు వస్తున్నాయి. అంతేకాదు ఈ సారి పక్కాగా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీ ఇతర పార్టీలను ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా, ఆమెను బీజేపీ నేతలు సంప్రదించగా.. తనకు ఏదో ఒక పదవి కట్టెబెట్టాలని కోరిందట. టీడీపీలో ఏ పదవి అయితే ఉందో ఇక్కడ కూడా అదే పదవి ఇస్తామని.. అంతేకాదు.. రానున్న ఎన్నికల్లో కోరుకున్న నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తామని కమలనాథులు హామీ ఇచ్చారని సమాచారం. అంటే యామినీకి బీజేపీ బంపరాఫర్ ఇచ్చింద్న మాట.! అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈనెల 10న అధికారికంగా కమలం పార్టీలో చేరునున్నారని తెలుస్తోంది. దీంతో యామిని టీడీపీకి టాటా చెప్పేసి.. కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమని పెద్ద ఎత్తున టీవీ చానెల్స్, సోషల్ మీడియాలో వార్తలు మొత్తం కోడై కూస్తోంది.
బాబు భారీ షాకే..!
కాగా.. ఈమెకు వైసీపీలో చేరికకు డోర్స్ క్లోజ్ అవ్వడంతో చేసేదేమీ లేక.. టీడీపీలో ఉండలేక బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పార్టీ మార్పుపై సోషల్ మీడియాలో.. టీవీ చానెల్స్‌లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ సీరియస్‌గా ఖండించిన దాఖలాల్లేవ్. అయితే నిజంగానే వీరిద్దరూ పార్టీ మారితే మాత్రం చంద్రబాబుకు ఊహించని షాకేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు.. టీడీపీలో ఇప్పుడు గట్టిగా మీడియా ముందుకొచ్చి వాయిస్ వినిపించే నేతలు అంతంత మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఇలా ఒక్కొక్కరుగా పార్టీకి టాటా చెప్పేయడం టీడీపీ గట్టి ఎదురుదెబ్బేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com