Sadhguru:అనారోగ్యం నుంచి కోలుకున్న సద్గురు.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ అభిమానులను శుభవార్త. బ్రెయిన్ సర్జరీ నుంచి కోలుకోవడంతో ఆయనను ఆపోలో వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చా్ర్జ్ చేశారు. కాగా కొన్ని రోజులుగా తీవ్ర తలనొప్పితో ఇబ్బంది పడుతున్న జగ్గీ వాసుదేవ్ ఇటీవల ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఢిల్లీ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే వాసుదేవ్ మెదడులో బ్లీడింగ్, వాపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం ఆయనకు బ్రెయిన్ ఆపరేషన్ నిర్వహించారు. అనంతరం మెల్లగా కోలుకోవడంతో డిశ్చార్జ్ అయ్యారు.
గత నాలుగు వారాలుగా సద్గురు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నట్లు అపోలో ఆస్పత్రిలోని సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆయనకు ప్రాణాంతకమైన పరిస్థితి నెలకొందని.. మెదడులో బ్లీడింగ్, వాపు ఉన్నట్లు సీటీ స్కాన్‌లో వెల్లడైందని చెప్పారు. వెంటనే ఆయనను ఢిల్లీ అపోలో ఆస్పత్రికి తీసుకువచ్చి సర్జరీ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం సద్గురుకు విజయవంతంగా ఆపరేషన్ పూర్తి అయిందని.. ఆయన మెల్లగా కోలుకుంటున్నారని తెలిపారు.
మరోవైపు బ్రెయిన్ సర్జరీ జరిగిన తర్వాత సద్గురు మాట్లాడుతున్న ఓ వీడియోను ఈషా ఫౌండేషన్ నిర్వాహకులు విడుదల చేశారు. తనకు ఏం జరగలేదని.. మొదడులో చిన్న వాపు ఉండటంతో వైద్యులు బ్రెయిన్ సర్జరీ ఆపరేషన్ నిర్వహించారని చెప్పారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని.. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తానని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులు అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుని మునుపటిలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రార్థనలు చేశారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ అయితే ఆయనను ఐసీయూలో బెడ్ మీద చూసి దేవుడే కుప్పకూలిపోయినట్లు అనిపించిందని ఎమోషనల్ అయ్యారు. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నా శివరాత్రి వేడుకలు నిర్వహించడం గొప్ప విషయమని.. మీరు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. అలాగే సద్గురు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మెగా కోడలు ఉపాసన కొణిదెల కూడా పోస్ట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments