నిర్మాతగా మారబోతున్న సదా
Send us your feedback to audioarticles@vaarta.com
‘జయం’ చిత్రంతో ఆకట్టుకున్న ఉత్తరాది భామ సదా నిర్మాతగా మారనున్నారా? అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఆ వివరాల్లోకి వెళితే.. మజిద్ దర్శకత్వంలో సదా కథానాయికగా నటిస్తున్న తమిళ చిత్రం ‘టార్చ్‌లైట్’. ఓ వేశ్యా జీవితానికి సంబంధించిన కథగా ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్టు తెలుస్తోంది. కథానాయికా ప్రాధాన్యత ఉన్న ఈ సినిమా కోసం చాలా మంది కథానాయికలను సంప్రదించారంట దర్శకుడు.
కాకపోతే.. పడుపు వృత్తికి సంబంధించిన కథ కావడంతో కథానాయికలు ఎవరూ ఈ సినిమాలో నటించడానికి ముందుకు రాలేదంట. ఇలాంటి సమయంలో సదా ఈ సినిమాలో నటించడానికి ధైర్యంగా ముందుకొచ్చిందని సమాచారం. అంతేగాకుండా.. దర్శకుడి పనితీరు బాగా నచ్చి.. అతని దర్శకత్వంలో తనే నిర్మాతగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి కూడా సదా ప్లాన్ చేస్తున్నారన్నది చెన్నై వర్గాల సమాచారం. కాగా.. ‘టార్చ్‌లైట్’ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments