కన్నడ సినీ పరిశ్రమలోనూ విషాదం..

  • IndiaGlitz, [Wednesday,May 31 2017]

ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు మ‌ర‌ణంతో తెలుగు చిత్ర‌సీమ శోక సంద్రంలో మునిగిపోయింది. ఇదే స‌మ‌యంలో అటు క‌న్న‌డ చిత్ర‌సీమ‌లో కూడా విషాదం నెల‌కొంది. లెజెండ్రీ న‌టుడు, క‌న్న‌డ కంఠీర‌వ రాజ్‌కుమార్ స‌తీమ‌ణి పార్వ‌త‌మ్మ రాజ్‌కుమార్ ఈరోజు తుది శ్వాస విడిచారు. కిడ్నీ, శ్వాస‌కోస సంబంధిత వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న పార్వ‌త‌మ్మ ఎం.ఎస్‌.రామ‌య్య ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉద‌యం నాలుగున్న‌ర గంట‌ల ప్రాంతంలో క‌న్నుమూశారు.

78 ఏళ్ళ పార్వ‌త‌మ్మ ఈ నెల 14 నుండి ఆసుప‌త్రిలో చేరారు. వెంటిలేట‌ర్స్‌పై చికిత్స తీసుకుంటున్న ఆమెకు వైద్యులు ప్ర‌త్యేక చికిత్స‌లు అందించినా లాభం లేక‌పోయింది. భ‌ర్త రాజ్‌కుమార్ లాగానే పార్వ‌త‌మ్మ కూడా త‌న రెండు క‌ళ్ళ‌ను దానం చేశారు. రాజ్‌కుమార్‌, పార్వ‌త‌మ్మ‌ల‌కు ఐదుగురు సంతానం. వీరిలో పునీత్ రాజ్‌కుమార్‌, శివ‌రాజ్‌కుమార్ క‌న్న‌డ‌లో అగ్ర హీరోలుగా కొన‌సాగుతున్నారు. నిర్మాత‌గా పార్వ‌త‌మ్మ అప్పు, అర‌సు, వంశీ, హుడుగారు, అభి వంటి సినిమాల‌ను నిర్మించారు. పార్వ‌త‌మ్మ మృతికి సంతాపాన్ని తెలియ‌జేస్తూ క‌న్న‌డ సినీ రంగం స్వ‌చ్చందంగా ఈ రోజు బంద్‌ను పాటిస్తుంది.

More News

మా 'అంధగాడు' చిత్రం దర్శకరత్న డా.దాసరిగారికి అంకితం - ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్

ప్రపంచంలో ఏ దర్శకుడు తీయలేనని విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి 151 చిత్రాల కు దర్శకుడిగా తన పేరును సువర్ణాక్షరాలతో

దాసరి మృతి పట్ల ప్రముఖుల సంతాపం

నా అత్యంత ఆప్తుడు మిత్రుడు దాసరి ఇండియా లోనే గొప్ప దర్శకుడు మంచి మనిషి అటువంటి మనిషిని కోల్పోవడం ఇండస్ట్రీకి తీరని లోటు....ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి

నేలకొరిగిన మేరునగ దర్శకధీరుడు దాసరి....

డా.దాసరి నారాయణరావు..ఓ గురువు....దిశానిర్ధేశకుడు...మారుతున్న ధోరణుల్లో తప్పొప్పులను నిర్భయంగా చెప్పే మార్గ దర్శకుడు..

దాసరి గారి మరణం షాక్ కి గురిచేసింది : చిరంజీవి

దర్శకరత్న దాసరిగారి అకాల మరణ వార్తను నేను జీర్ణించుకోలేకపోతున్నాను.ఇటీవలే ఆయన ఆనారోగ్యం కారణంగా అల్లు రామలింగయ్య గారి అవార్డును స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి నా చేతు మీదుగా అందజేశాను.