శాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Send us your feedback to audioarticles@vaarta.com
సునిశిత్ స్టార్ తెలుసా? అంటే పెద్దగా ఎవరికీ తెలియదు కానీ శాక్రిఫైసింగ్ స్టార్ అంటే మాత్రం తెలియని వారుండరు. సునిశిత్‌కి నెటిజన్లు ఇచ్చిన బిరుదు అది. మనోడు చేసిన త్యాగాలు ఆ రేంజ్‌లో ఉన్నాయి మరి. ‘వన్ - నేనొక్కడినే’ సినిమా తాను చేయాల్సిందేనని మహేష్ బాబు కోసం శాక్రిఫైస్ చేశానని తెలిపాడు. ఆయన త్యాగం చేసిన లిస్టులో ఒక్క మహేషే కాదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రవితేజ తదితరులున్నారు. అంతటితో ఆగాడా.. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నానని.. మరో హీరోయిన్‌తో ప్రేమాయణం నడిపానని.. రచ్చ రచ్చ చేశాడు. కరోనా ప్రారంభానికి ముందు యూట్యూబ్‌లో సునిశిత్ చేసిన రచ్చ ప్రేక్షకుల్ని చాలా ఎంటర్‌టైన్ చేసింది. పోను పోనూ విసుగు కూడా తెప్పించింది.
అయితే సునిశిత్‌పై గతంలో లావణ్య త్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. లావణ్యను తాను పెళ్లి చేసుకున్నానని.. ఆ తరువాత విడిపోయామంటూ సునిశిత్ చేసిన వ్యాఖ్యలపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే విసుగు చెందిన మరికొందరు కూడా సునిశిత్‌పై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సునిశిత్‌పై రాచకొండ కమిషనరేట్‌లో రెండు కేసులు, ఇబ్రహీంపట్నం కీసరలో ఒక కేసు నమోదైంది. విచారణ నిర్వహించిన పోలీసులు తాజాగా సునిశిత్‌ని అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments