'శ్రీమంతుడు' ని సచిన్ చూస్తాడట...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్‌బాబు - శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీమేకర్స్ అండ్ ఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లి. బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ (సి.వి.ఎం) నిర్మించిన చిత్రం 'శ్రీమంతుడు'. ఈ చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్‌ని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు నవీన్, మోహన్‌లు పాల్గొన్నారు.
'శ్రీమంతుడు' చిత్రం మూడో వారంలో కూడా చాలా స్ట్రాంగ్‌గా నిలబడి హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని మేం కష్టపడిన దానికంటే ఎక్కువ సక్సెస్ చేసినందుకు చాలా ఆనందంగా వుంది. ఇంత పెద్ద హిట్ చేసిన ఫ్యాన్స్‌కి, ఆల్ సెక్షన్స్ ఆడియన్స్‌కి మా టీమ్ తరఫున స్పెషల్ థాంక్స్. చాలామంది ది బెస్ట్ ఫిలిం చేశాం. మంచి కంటెంట్ ఉన్న సినిమా చేశాం అని అప్రీషియేట్ చేశారు.
అది మా రెస్పాన్స్‌బిలిటీగా బిగ్ కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాం. ట్రైలర్‌లో రాజేంద్రప్రసాద్, శృతిహాసన్ ఊరి జనం నడుచుకుంటూ వచ్చే సీన్‌ని లెంగ్త్ కారణంగా సినిమాలో ఎడిట్ చేశాం. అయినా సినిమా చాలా బాగుంది. పెద్ద హిట్ చేశారు. అయితే ఆ ట్రైలర్‌లో ఉన్న సీన్ కూడా ఉంటే బాగుండేది అని చాలా మంది చెప్పారు. మేం కూడా హ్యాపీగా ఫీలయి ఆ సీన్‌ని యాడ్ చేస్తున్నాం. ఫుల్ కంటెంట్ ఉన్న సినిమా చేశామన్న ధైర్యంతో, కాన్ఫిడెన్స్‌తో ఆ సీన్స్‌ని జత చేస్తున్నాం. సెన్సార్ పూర్తయింది. 28వ తేదీ సాయంత్రం నుండి ఫస్ట్ షోలలో రెండు సీన్స్ ని యాడ్ చేస్తున్నామని దర్శకుడు కొరటాల శివ అన్నారు.
మా బ్యానర్‌లో ఫస్ట్‌టైం నిర్మించిన 'శ్రీమంతుడు' చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అవడం చాలా ఆనందంగా వుంది. దీనికి కారణమైన సూపర్‌స్టార్ మహేష్, కొరటాల శివ గారికి చాలా థాంక్స్. త్రీ వీక్స్ కలెక్షన్స్ చూసి తెలుగు ఇండస్ట్రీలో సెకండ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రమని అంటున్నారు. చాలా మంచి సినిమా తీశారు అని అప్రీషియేట్ చేస్తున్నారు. ఈ మూవీ చూసిన సెలబ్రిటీస్, స్పోర్ట్స్ పర్సన్స్, పొలిటీషియన్స్ నుండి మంచి అప్లాజ్ వచ్చింది. సచిన్ టెండూల్కర్ కూడా సినిమా చూస్తానన్నారని నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com