సచిన్‌కు షాక్.. ఆదిత్యకు గుడ్ న్యూస్!
Send us your feedback to audioarticles@vaarta.com
క్రికెట్ దేవుడు, భారతరత్న సచిన్ టెండూల్కర్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం సడన్ షాకిచ్చింది.! అయితే ఇదే క్రమంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఎమ్మెల్యే ఆదిత్య థాక్రేకు శుభవార్త చెప్పింది!. సచిన్‌కు ఎక్స్ కేటగిరీ భద్రత ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ భద్రతను కుదిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక నుంచి సచిన్‌కు 24 గంటల సెక్యూరిటీ ఉండదని ఎస్కార్ట్ సదుపాయం మాత్రమే ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిత్య థాక్రేకు మాత్రం భద్రతను పెంచారు. ప్రస్తుతం ఉన్న ‘వై ప్లస్’ సెక్యూరిటీ నుంచి ‘జెడ్ ప్లస్’కు పెంచారు. అయితే ఆదిత్యకు సెక్యూరిటీ పెంచడం వెనుక పలు కారణాలన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సచిన్‌కు భద్రత తొలగించి తన కుమారుడికి ఉద్ధవ్ పెంచుకోవడమేంటి..? అని ఒకింత విమర్శలు సైతం వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఆయా వ్యక్తులకున్న ముప్పును పరినణనలోకి తీసుకొన్న తర్వాత ఈ విషయంపై ఏర్పాటైన కమిటీ బుధవారం సమావేశమై సెక్యూరిటీ విషయమై కీలక నిర్ణయాలను తీసుకొంది. కాగా సచిన్‌తో పాటు పలువురు బీజేపీ నేతలకు భద్రత తొలగించడం.. మరికొందరికి పెంచడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ నేత ఏక్నాథ్ ఖడ్సేకు ఉన్న ‘వై సెక్యూరిటీ’ని ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. అంతేకాదు.. మరో బీజేపీ నేత, ఉత్తర ప్రదేశ్ మాజీ గవర్నర్ రామ్ నాయక్‌కు జెడ్ ప్లస్ నుంచి ఎక్స్ కేటగిరీకి మార్చడం జరిగింది. ఇలా మొత్తం మహారాష్ట్రలో 97 మందికి ఇలాంటి భద్రతా సదుపాయాలు ఉండగా, 29 మందికి భద్రతా కేటగిరీలో మార్పులు, చేర్పులు చేయడం జరిగింది. అయితే మొత్తం 16 మందికి భద్రతను ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. కాగా.. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం మాత్రమే ఈ మార్పులు చేయడం జరిగిందని శివసేన శ్రేణులు చెబుతున్నాయి. అయితే ఈ భద్రత తొలగింపుపై సచిన్ టెండుల్కర్ ఇంతవరకూ స్పందించలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments