నాదెండ్లగా సచిన్

  • IndiaGlitz, [Sunday,May 06 2018]

నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. ఈ సినిమాలో నటించే కొందరు నటీనటుల వివరాలు ఇప్పటికే ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో కీలకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న నాదెండ్ల భాస్కరరావు పాత్రని సచిన్ ఖేడ్కర్ పోషించబోతున్నారని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

మరాఠి నటుడైన సచిన్ ఖేడేక‌ర్‌ బాలీవుడ్ చిత్రాలతోపాటు దక్షిణాది సినిమాల్లో కూడా నటించారు. జనతా గ్యారేజ్, నేను లోకల్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సచిన్ సుపరిచితుడే. 1985లో తెలుగుదేశం పార్టీలో నాదెండ్ల తిరుగుబాటు జెండా ఎగరేసి ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి గద్దె దింపిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ సినిమాలో ఎలా చూపిస్తారన్నది అందరికీ ఆసక్తి కలిగించే విషయం.