'వీడెవడు' అంటున్న సచిన్ జోషి

  • IndiaGlitz, [Monday,March 27 2017]

మౌన‌మేల‌నోయి, ఓరేయ్‌..పండు, నీ జ‌త‌గా నేనుండాలి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన స‌చిన్‌జోషి హీరోగా తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న స‌స్పెన్స్ క్రైం థ్రిల్ల‌ర్ 'వీడెవ‌డు'. ప్రొ క‌బ‌డ్డీ ప్లేయ‌ర్ అయిన హీరో, ఫ్యాన్‌గా ప‌రిచ‌య‌మైన హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. కానీ అప్ప‌టికే కొంత‌మంది హీరోయిన్‌ను చంప‌డానికి ప్ర‌య‌త్నం చేస్తుంటారు. అది తెలుసుకున్న హీరో త‌న ల‌వ‌ర్‌ను కాపాడుకోవ‌డానికి ఏం చేశాడు? హీరో చేసిన రిస్క్ ఎంట‌నేదే ఈ క‌థ‌. ఈ సినిమాను త‌మిళంలో యారివ‌న్ అనే పేరుతో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ను సోమ‌వారం హైదరాబాద్‌లో విడుద‌ల చేశారు.
ఎస్‌.ఎం.ఎస్‌, భీమిలి క‌బ‌డ్డీ జట్టు, శంక‌ర సినిమాలు అన్నీ రీమేక్ చిత్రాలే. నేను తెలుగులో చేసిన స్ట్ర‌యిట్ మూవీ వీడెవ‌డు.బినేంద్ర మీన‌న్ సినిమాటోగ్ర‌ఫీ, థ‌మ‌న్ మ్యూజిక్‌, ర‌ఘు కుల‌క‌ర్ణి ఆర్ట్‌, స‌హా అంద‌రూ ఎంతో స‌పోర్ట్ చేశారు. క‌న‌ల్‌క‌ణ్ణ‌న్‌గారి ఫైట్స్ హైలైట్‌గా అనిపిస్తాయి. స‌చిన్ జోషిగారు ఎక్స‌లెంట్‌గా న‌టించారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మే నెలాఖ‌రున విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం అని ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య తెలిపారు.
వీడెవ‌డు సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. సినిమా కోసం ప‌నిచేసిన వారంద‌రూ ప్యాష‌న్‌తో వ‌ర్క్ చేశారు. టీజ‌ర్ అంద‌రికీ న‌చ్చింది. అలాగే సినిమా కూడా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుందని హీరో స‌చిన్ జోషి అన్నారు.

More News

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న 'డిజె దువ్వాడ జగన్నాథమ్'

ఆర్య నుండి సరైనోడు వరకు డిఫరెంట్ చిత్రాలతో తెలుగు చిత్రసీమలో స్టైలిష్ స్టార్ గా తనదైన ముద్ర వేసుకున్న హీరో అల్లుఅర్జున్.

బుర్రలేని దర్శకులతో ఇకపై పనిచేయను: కీరవాణి

రెండు వందల చిత్రాలకు పైగా సంగీతం అందించిన సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మితభాషి. బాహుబలి తర్వాత తాను సినీ సంగీతం నుండి విరమణ తీసుకుంటానని ఇది వరకు ప్రకటించిన సంగతి తెలిసిందే.

స్టార్ హీరోగానే కాదు, నిర్మాతగా కూడా మెప్పిస్తున్న మెగాపవర్ స్టార్

సినిమా పరిశ్రమ ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు..ముఖ్యంగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో హీరోగా రాణించడమంటే అంత సులవు కాదు.

'బాహుబలి' వంటి ఇన్ స్పైరింగ్ చిత్రంలో భాగమైనందకు ఆనందంగా, గర్వంగా ఉంది - కరణ్ జోహార్

తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి తెలియజేసిన విజువల్ వండర్ 'బాహుబలి 2'.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్,అనుష్క,రానా దగ్గుబాటి తారాగణంగా

పొల్లాచ్చిలో 'మేడమీద అబ్బాయి'

అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు.