కోడి రామకృష్ణ ఆవిష్కరణ లో 'ఇదో ప్రేమలోకం' టీజర్, పోస్టర్
Monday, March 27, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ శ్రీనివాస ఫిలింస్ పతాకంపై ఎస్.పి.నాయుడు నిర్మించిన చిత్రం -`ఇదో ప్రేమలోకం`. కోడి రామకృష్ణ శిష్యుడు కరణ్ రాజ్ స్వీయరచన, దర్శకత్వంలో తెరకెక్కించారు. సెన్సార్ సహా అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీగా ఉంది. ఉగాది తర్వాత రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్, పోస్టర్ని కరణ్‌రాజ్ గురువు గారైన ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ స్వయంగా లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా కోడి రామకృష్ణ మాట్లాడుతూ -``ఈ తరం చూడాల్సిన చక్కని ప్రేమకథా చిత్రమిది. ప్రేమకథలు ఎప్పుడూ విషాదాంతమే. అలాంటివి చరిత్ర పుటల్లోనూ నిలుస్తాయి. అశోక్ చంద్ర ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. సీనియర్లు సుమన్, నరేష్ చక్కగా నటించారు. వందేమాతరం సంగీతం అద్భుతంగా కుదిరింది. పాటలు బావున్నాయి. సినిమా పెద్ద విజయం సాధించి అందరికీ పేరు తేవాలి`` అన్నారు.
అశోక్‌చంద్ర, తేజారెడ్డి, కారుణ్య, సుమన్, నరేష్, భగవాన్, `రాజా సూర్య వంశీ` మేల్కోటి, చిట్టిబాబు, ధనుంజయ, మాష్టర్ చంద్రమహేష్, దేవీశ్రీ, ప్రభావతి తదితరులు నటించారు. ఈ చిత్రానికి పాటలు: టి.కరణ్‌రాజ్- ఎ.కరుణాకర్, చిలకరెక్క గణేష్, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, కెమెరా: శివ.కె, ఎడిటింగ్: నందమూరి హరి, నిర్మాత: ఎస్.పి.నాయుడు, సమర్పణ: డా.స్వర్ణలత-సురేష్ బాబు, కథ-కథనం-మాటలు-దర్శకత్వం: టి.కరణ్ రాజ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments