'సాహో' తాజా షెడ్యూల్ గురించి సాబు సిరిల్ ఏమన్నారంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
నాలుగు సార్లు బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్‌గా నేషనల్ అవార్డులను కైవసం చేసుకున్నారు సాబు సిరిల్. ఐదు సార్లు బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్‌గా ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. అంతేగాకుండా.. 'ఎందిరన్' ('రోబో') సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు.
ఇక 'బాహుబలి' సిరీస్‌తో తన ఖ్యాతిని మరింతగా చాటుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'సాహో' మూవీకి పనిచేస్తున్నారు సాబు సిరిల్. ఈ సినిమా గురించి సాబు సిరిల్ ఓ మీడియాతో మాట్లాడుతూ "గడచిన ఆరు నెలల్లో దాదాపు 8 సార్లు అబుధాబికి వెళ్ళివచ్చాను.
నెలన్నర క్రితం 300 మంది పెయింటర్లు, మౌల్డర్లు, కార్పెంటర్లు, వెల్డర్లతో పాటు.. డిజైనర్లతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడి ఏర్పాట్ల కోసం హైదరాబాద్‌లో చాలా రీసెర్చ్ చేశాం.ఇక్కడి సన్నివేశాలకి కావలసిన మెటీరియల్‌ను 4 కంటైనర్లలో అబుధాబికి పంపించాం. ప్రస్తుతం నా టీమ్ నెలన్నరగా ఇక్కడ చిత్రీకరించబోయే యాక్షన్ సన్నివేశాల ఏర్పాట్లలో తలమునకలై ఉంది" అని తెలిపారు.
హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్ని బాట్స్ 'సాహో' కోసం యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేస్తున్నారు. తాజాగా శంకర్ '2.O' మూవీకి కూడా స్టంట్ కో-ఆర్డినేటర్‌గా పనిచేశారు కెన్ని. కాగా.. ఏప్రిల్ 12 నుంచి అబుధాబిలో ఆసక్తిని రేకెత్తించే యాక్షన్ సీన్స్‌ను కెన్ని పర్యవేక్షణలో చిత్రీకరించనున్నారు. యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com