ఆచార్య నుంచి ‘‘ శానా కష్టం వచ్చిందే మందాకినీ’’.. ఫుల్ సాంగ్ , రెజీనాతో చిరు మాస్ స్టెప్పులు
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘‘ఆచార్య’’ సినిమాను ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. ఇప్పటికే ఆచార్య నుంచి విడుదలైన పాటలు, లుక్స్‌కి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి 'శానా కష్టం' అనే మరో సాంగ్ ను విడుదల చేశారు. ఇప్పటికే నిన్న సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
'శానా కష్టం వచ్చిందే మందాకినీ... చూసేవాళ్ల కళ్లు కాకులు ఎత్తుకు పోనీ... నీ నడుం మడతలోనే జనం నలిగిపోనీ' అంటూ సాగుతున్న ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి, రెజీనాతో స్టెప్పులు వేశారు. భాస్కర భట్ల రవికుమార్ రాసిన ఈ పాటకు మణిశర్మ స్వరాలు అందించారు. రేవంత్, గీతా మాధురి ఆలపించారు. ఇప్పటికే ఆచార్య నుంచి విడుదలైన 'లాహె లాహె', 'నీలాంబరీ' పాట ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మించిన ఆచార్యలో కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రామ్‌చరణ్, పూజాహెగ్డే, సోనూసూద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన రాజా దర్శకత్వంలో గాడ్‌ఫాదర్‌తో పాటు మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్, బాబీ డైరెక్షన్‌లో ‘‘వాల్తేర్ వీరయ్య’’, వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు మెగాస్టార్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments