'సానా క‌ష్టం' అంటూ రెజీనాతో చిరు స్టెప్పులు... 'ఆచార్య' సాంగ్ ప్రోమో కేక

మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంభినేషన్‌లో తెరకెక్కిన ఆచార్య సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. ఇప్పటికే ఆచార్య నుంచి విడుదలైన పాటలు, లుక్స్‌కి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి 'సానా కష్టం' అనే మరో సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆదివారం విడుదల చేశారు. రేపు సాయంత్రం(జనవరి 3) 4:05 గంటలకు పూర్తి పాటను విడుదల చేయనున్నారు.

చూస్తుంటే.. ఇదొక ఐటెం సాంగ్ అని తెలుస్తోంది. ఈ పాటలో హీరోయిన్‌ రెజీనాతో కలిసి స్టెప్పులేస్తూ కనిపించారు చిరంజీవి. మణిశర్మ మాస్ బీట్‌కి చిరు స్టెప్పులు అదిరిపోయాయి. ఇప్ప‌టికే ఆచార్య నుంచి విడుద‌లైన 'లాహె లాహె', 'నీలాంబ‌రీ' పాట ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రించాయి. దేవాదాయ భూములు అన్యాక్రాంతం కావ‌డం అనే అంశంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మెసేజ్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను మిక్స్ చేసి సినిమాల‌ను తీయ‌డంలో కొరటాలకు మంచి పేరుంది. అదే జోష్‌ను కొన‌సాగిస్తూ ఈ సినిమాలో గిరిజ‌నుల బ‌తుకు చిత్రాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టేలా చూపించ‌నున్నట్లు ఇప్ప‌టికే విడుద‌లైన ప్రోమోల ద్వారా తెలుస్తోంది.

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మించిన ఆచార్యలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. పూజాహెగ్డే కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన రాజా దర్శకత్వంలో గాడ్‌ఫాదర్‌తో పాటు మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్, బాబీ డైరెక్షన్‌లో ‘‘వాల్తేర్ వీరయ్య’’, వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు మెగాస్టార్.

More News

ఔను కాజల్ ప్రెగ్నెంట్.. కన్ఫర్మ్ చేసిన గౌతమ్ కిచ్లు, ఒకే ఒక్క పోస్ట్‌తో ప్రచారానికి చెక్

గత కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రచారానికి సినీ నటి కాజల్ దంపతులు తెరదించారు. న్యూఇయర్ కానుకగా ఆమె తన అభిమానులకు శుభవార్త చెప్పారు.

ఏఆర్ రెహమాన్ ఇంట్లో పెళ్లి భాజాలు… పెళ్లీపీటలెక్కనున్న పెద్ద కుమార్తె, వరుడు ఎవరంటే..?

భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఇంట్లో పెళ్లి భాజాలు మోగాయి. ఆయన కుమార్తె ఖతీజా రెహమాన్ నిశ్చితార్థం గత నెల 29న ఘనంగా జరిగింది.

టాలీవుడ్‌కు పెద్దదిక్కుగా ఉండను... పంచాయతీలు చేయను: చిరంజీవి కీలక వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు పెద్దగా ఉండటం తనకు అస్సలు ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ టైంలో మా వల్ల కాదు .. ‘‘ఆర్ఆర్ఆర్’’ వాయిదా, చిత్రయూనిట్ అధికారిక ప్రకటన

అనుకున్నదే నిజమైంది.. ఊహాగానాలే వాస్తవాలయ్యాయి. టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘‘ఆర్ఆర్ఆర్’’ వాయిదా పడింది.

బంగార్రాజు టీజర్‌ : నాగ్, చైతూ కుమ్మేశారుగా.. సంక్రాంతికి విందు భోజనమే..!!

కింగ్ నాగార్జున, రమ్యకృష్ణ కలసి నటించిన ‘‘ సోగ్గాడే చిన్నినాయన’’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చిత్రం బంగార్రాజు .