అమెరికాలోని అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకొంటున్న'సాక్ష్యం'
Send us your feedback to audioarticles@vaarta.com
బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'సాక్ష్యం' ప్రస్తుతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. 15 రోజుల షెడ్యూల్ లో అమెరికాలోని సుదరమైన లొకేషన్స్ లో చిత్ర బృందం చిత్రీకరణ జరపనుంది.
న్యూయార్క్, గ్రాండ్ కెన్యాన్, న్యూజెర్సీ ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్-పూజా హెగ్డేల నడుమ ఒక సాంగ్ ను కూడా షూట్ చేయనున్నారు.
హై టెక్నికల్ వేల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తుండగా.. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: ఏ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హైన్స్, సంగీతం: హర్షవర్ధన్, నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత: అభిషేక్ నామా, రచన-దర్శకత్వం: శ్రీవాస్!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com