జూలై 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న 'సాక్ష్యం'
Send us your feedback to audioarticles@vaarta.com
బెల్లంకొండ సాయి శ్రీనివాస్-పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం "సాక్ష్యం". ఈ చిత్రాన్ని జూలై 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తొలుత ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదల చేయనున్నామని ప్రకటించినప్పటికీ.. సి.జి వర్క్ పెండింగ్ ఉండడంతో విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది.
"బాహుబలి" చిత్రానికి వర్క్ చేసిన మకుట టీం "సాక్ష్యం" సి.జి వర్క్ చేస్తోంది. దర్శకనిర్మాతలు అవుట్ పుట్ విషయంలో ఎక్కడా రాజీపడడం లేదు. పంచభూతాల నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచనున్నాడు దర్శకుడు శ్రీవాస్. విడుదలైన టీజర్ కు విశేషమైన రెస్పాన్స్ వచ్చింది, మా అంచనాలను మించే స్థాయిలో ప్రేక్షకులు "సాక్ష్యం" టీజర్ ను ఆదరించారు. అలాగే.. విడుదలైన రెండు పాటలు కూడా విశేషమైన ఆదరణ చూరగొన్నాయి.
బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: ఏ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హైన్స్, సంగీతం: హర్షవర్ధన్, నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత: అభిషేక్ నామా, రచన-దర్శకత్వం: శ్రీవాస్!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments