'సాక్ష్యం' కు క్రేజీ ఆఫర్

  • IndiaGlitz, [Thursday,March 01 2018]

అల్లుడు శీను' సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన‌ యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీ‌నివాస్‌. ఆ తర్వాత స్పీడున్నోడు', జయ జానకి నాయక' సినిమాలతో ప‌ల‌క‌రించాడు. ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాక్ష్యం'లో నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. చిత్రీకరణ చివరిదశలో ఉన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది.

అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 11న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌కు క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కించి జీ టీవీ వారు తెలుగు హ‌క్కుల‌ను 5.5 కోట్ల‌కు, హిందీ శాటిలైట్ హ‌క్కుల‌ను 8 కోట్ల‌కు అంటే మొత్తంగా 13.5కోట్ల రూపాయ‌ల‌కు ఈ సినిమా శాటిలైట్ బిజినెస్‌ను పూర్తి చేసుకుంది.