సెన్సార్ పూర్తి చేసుకున్న సాక్ష్యం..27 న గ్రాండ్ రిలీజ్..!!

  • IndiaGlitz, [Tuesday,July 24 2018]

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన సాక్ష్యం మూవీ సెన్సార్ కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ ని పొందగా జులై 27 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ చేయబోతుంది.. గ్లామర్ డాల్ పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహించారు.

పంచభూతాలు అనే నేచర్ కాన్సెప్ట్ వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలున్నాయి.. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, థియరిటికల్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రాగా ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.. ఏ.విల్సన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసారు.. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ ఈ చిత్రాన్ని నిర్మించగా ఈ చిత్రంలో జగపతి బాబు, శరత్ కుమార్, రావు రమేష్, రవి కిషన్, అశుతోష్ రాణా, పవిత్రా లోకేష్, వెన్నెల కిషోర్ మీనా తదితరులు నటించారు..

తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే, శరత్ కుమార్, మీనా, జగపతి బాబు, రవి కిషన్, అశుతోష్ రాణా, మధు గురు స్వామి, జే ప్రకాష్, పవిత్రా లోకేష్ మరియు వెన్నెల కిషోర్.