సాక్ష్యం పాటలు విడుదల!
Send us your feedback to audioarticles@vaarta.com
బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'సాక్ష్యం' సినిమా . అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మాతగా.. శ్రీవాస్ దర్శతక్వంలో సినిమా రూపొందుతోంది.
హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ట్రైలర్‌ను..ఆడియో సీడీలను పార్లమెంట్ సభ్యులు, టీన్యూస్ ఎం.డి సంతోశ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో...
బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ... "ఇంత మంచి కథతో.. నాతో సినిమా చేసిన శ్రీవాస్‌గారికి థాంక్స్. ఇలాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. కెరీర్ బిగినింగ్‌లోనే నేను చేయడం ఆనందంగా ఉంది. నా భుజాలపై మోయాల్సిన కథ ఇది. నేను ఈ కథతో సినిమా చేయగలుగుతానని నమ్మిన శ్రీవాస్ అన్నకు.. అలాగే ఓ మంచి కథను నమ్మి టేస్ట్‌ఫుల్‌గా నిర్మించిన అభిషేక్ నామాగారికి థాంక్స్. హర్షవర్ధన్ రామేశ్వర్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. మరో సినిమా ఏదీ ఒప్పుకోకుండా ఏడాదిగా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. జగపతిబాబుగారు, రవికిషన్గారికి, అశుతోష్రాణాగారికి.. నా ఫ్రెండ్ పూజా హెగ్డేకి థాంక్స్. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణలకు థాంక్స్" అన్నారు.
శ్రీవాస్ మాట్లాడుతూ... "నేను మాట్లాడాల్సిందంతా నా థియేట్రికల్ ట్రైలర్, నా పంచభూతాల పాట మాట్లాడేసింది. నేను ఇంతకు ముందు ఐదు సినిమాలు చేసి, ఆ ఎక్స్ పీరియన్స్ తో ఆరో సినిమాగా ఈ సినిమా చేశాను. రకరకాల కాన్సెప్ట్ లు ఆలోచించి, కొత్త కథలు చెప్పినా ఆడియన్స్ అర్థం చేసుకునే స్థాయికి వచ్చేశారని గ్రహించి ఫైనల్‌గా ఈ కథను చెప్పాం. పంచభూతాల ఐడియా రాగానే, పంచభూతాల సపోర్ట్ తోనే ఈ సినిమా అలా జరిగింది. కొన్ని ఐడియాలు ఎలా వచ్చాయో నాకే ఆశ్చర్యం వేస్తుంది. అవి ఎప్పుడూ నేను చూసినవి కావు, ఎక్కడా విన్నవి కావు. మంచి కథను, మంచి విషయాన్ని జనాల్లోకి చెప్పాలనే ఆలోచన నాకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే పంచభూతాలు కూడా నాతో ఈ పనులు చేయించాయి.
ఈ కథ పూర్తి కాగానే బెల్లంకొండ సురేశ్‌గారికి చెప్పాను. ఇలాంటి థాట్స్ చాలా మందికి ఉండవచ్చు. కానీ డబ్బు పెట్టగల నిర్మాతలు, దమ్మున్న హీరోలు రావాలి. సురేశ్‌గారు వాళ్లబ్బాయి కోసం ఈ కథను వెంటనే ఓకే చేశారు. మనకు నిర్మాతలు చాలా మంది ఉంటారు. రూపకర్తలు చాలా తక్కువ మంది ఉంటారు. అభిషేక్ మేకర్.
కథను నమ్మి బడ్జెట్ ఎక్కువ అయినా సరే, తను చేశారు. సాయిమాధవ్ డైలాగులు, విల్సన్ ఫొటోగ్రఫీ హైలైట్ అవుతుంది,చాలా మంచి విజువల్స్ ఇచ్చారు విల్సన్ నాకు ఫొటోగ్రఫీగా కన్నా, మనిషిగా చాలా ఇష్టం. అందరూ మనసున్న మనుషులు కలిసి చేశాం. ఈ సినిమా మొత్తం మాతోనే ఉండి డార్లింగ్ డార్లింగ్ అంటూనే చాలా సపోర్ట్ చేశారు. నా విజన్‌కి ఎక్కడా తక్కువ కాకుండా చేశారు. హర్షవర్ధన్ చాలా బాగా మ్యూజిక్ చేశారు. కొత్త సౌండింగ్ ఉంటే బావుంటుందని అనుకుంటున్న టైమ్‌లో హర్షవర్ధన్ దొరికాడు. ఇలాంటి పెద్ద సినిమాకు ఎక్కువ .
అనీల్ సుంకర మాట్లాడుతూ... "ఈ సాంగ్ చూడగానే లెజెండ్‌లో సాంగ్ గుర్తుకొచ్చింది. ఆ రేంజ్ హిట్ కావాలని.. శ్రీనివాస్, శ్రీవాస్, అభిషేక్‌గారికి బ్లాక్ బస్టర్ హిట్ రావాలని కోరుకుంటున్నాను" అన్నారు.
నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ... "థాంక్ ఎవ్రీవన్. బయట వర్షం పడ్డా మా ఫంక్షన్‌ని అభిమానులు ఇంత ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది" అని చెప్పారు.
డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ... "బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఆల్రెడీ ఓ సినిమా చేశాడు. తను హార్డ్‌వర్కర్. ఎనర్జిటిక్ కుర్రాడు. డైరెక్టర్స్‌కి ఎంతో కో ఆపరేటర్ చేస్తాడు. షూటింగ్ సమయంలో ఏదైనా గాయం తగిలినా ఎవరికీ చెప్పడు. సినిమా మంచి ఎనర్జిటిక్, కమర్షియల్ సినిమా అని తెలుస్తుంది. శ్రీవాస్ రెండు సంత్సరాలుగా ఈ ప్రాజెక్ట్‌పై కష్టపడుతున్నారు. విజువల్స్ చూస్తుంటే ఫీస్ట్‌లా అనిపిస్తుంది. అభిషేక్ భారీ బడ్జెట్‌తో చేస్తున్న సినిమా ఇది. ఈ నెల 27న విడుదలవుతుంది" అన్నారు.
డైరెక్టర్ దశరథ్ మాట్లాడుతూ... "సినిమాను బాగా ఇష్టపడే దర్శకుడు శ్రీవాస్. ఈ సినిమాతో తను బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి టాప్ రేంజ్‌కి చేరుకోవాలి. బెల్లంకొండలో టాప్ హీరో కావడానికి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి తనలో. ఈ సినిమాతో తను పెద్ద రేంజ్‌కి చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఎంటైర్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్" అన్నారు.
నటుడు రవికిషన్ మాట్లాడుతూ... "శ్రీవాస్‌గారు కథ చెప్పగానే.. సినిమా హిట్ అని చెప్పాను. శ్రీనివాస్ చాలా హార్డ్ వర్క్ చేశాడు. పీటర్ హెయిన్స్ సినిమాకు ఆత్మలా పనిచేశారు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేశారు" అన్నారు.
అడివి శేష్ మాట్లాడుతూ... "సాయి శ్రీనివాస్‌ని జిమ్‌లో కలిశాను. కలిసి వర్కవుట్ చేశాను. మనోడు వర్కవుట్ చేస్తూ పోయాడు. నేను ఆగిపోయాను. ట్రైలర్, టీజర్, సాంగ్స్ చూస్తుంటే పెద్ద కాన్వాస్ మీద మంచి కథను చెబుతున్నారనే నమ్మకం ఉంది. ఈ సినిమా జులై 27న విడుదల కానుంది. ఒక వారం తర్వాత సేమ్ ప్రొడ్యూసర్‌తో చిన్న సినిమా ఒకటి విడుదలవుతుంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి" అని అన్నారు.
మ్యూజిక్ డైరక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ మాట్లాడుతూ.. "నాకు ఈ అవకాశం ఇచ్చిన అభిషేక్‌గారికి, మా దర్శకుడుగారికి రుణపడి ఉంటాను. ఇలాంటి ప్రాజెక్ట్ ను నాకు ఇవ్వడం చాలా పెద్ద విషయం. డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. పంచభూతాల సాంగ్‌తో నా జర్నీ మొదలైంది. ఈ సాంగ్‌ని ఐదు మంది పాడారు. అనంతశ్రీరామ్ చాలా బాగా రాశారు. ఆయన సపోర్ట్ లేకపోతే ఈ సాంగ్ ఇంత బాగా వచ్చేది కాదు" అని చెప్పారు.
పూజా హెగ్డే మాట్లాడుతూ... "మా దర్శకుడు శ్రీవాస్‌గారు నాకు చాలా డిఫరెంట్ రోల్ ఇచ్చారు. ఇందులో నేను స్పిరిచువల్ స్పీకర్‌గా చేశాను. డీజే కన్నా డిఫరెంట్ రోల్ ఇది. నిర్మాతకు చాలా డబ్బులు రావాలి.
అభిషేక్ తనయుడు, అనంతశ్రీరామ్ ఈ సినిమాలో నటించారు. ఫ్యామిలీ సాంగ్ డుంగు డుంగు, చెలియా నా ఫేవరేట్ సాంగ్స్ . సంగీత దర్శకుడు చాలా మంచి సంగీతాన్నిచ్చారు. సాయి చాలా మంచి ఫ్రెండ్. తను చాలా ఫ్రెండ్లీ పర్సన్. సాయి హార్డ్ వర్క్, డెడికేషన్ గ్రేట్. సాయి చాలా మంచి వ్యక్తి. తను చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు" అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments