బుల్లితెరపై కూడా ఆకట్టుకోలేక పోయిన ‘సాహో’..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్‘బాహుబలి’తరువాత భారీ అంచనాలతో పాటు భారీ బడ్జెట్‌తో వచ్చిన చిత్రం ‘సాహో’.'రన్ రాజా రన్' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి. కనీసం ‘బాహుబలి’రేంజ్‌కి అయితే తగ్గదని అంతా భావించారు. అయితే సినిమా బాలీవుడ్లో మినహా మరెక్కడా ఆశించిన ఫలితాన్నైతే ఇవ్వలేకపోయింది. ‘బాహుబలి’ని దృష్టిలో పెట్టుకుని ‘సాహో’ను చూసిన ప్రేక్షకులను ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చివరకు ఈ చిత్రం పరాజయం పాలైన సినిమాల లిస్టులో చేరిపోయింది.
వెండితెరపై బొక్క బోర్లా పడిన ‘సాహో’.. బుల్లితెరపై కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వరల్డ్ ప్రీమియర్ షోగా ఈ చిత్రం బుల్లితెరపై ప్రసారమైంది. స్టార్ హీరోల సినిమాలు మూడోసారి, నాలుగో సారి బుల్లితెరపై ప్రసారం అయినప్పటికీ భారీగా టీఆర్పీ రేటింగ్స్ సాధిస్తాయి. కానీ ‘సాహో’ మాత్రం చాలా తక్కువ టీఆర్పీని సాధించింది. ఈ చిత్రానికి వచ్చిన టీఆర్పీ చూసి ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. చివరకు ప్రసారం చేసిన ఎంటర్టైన్మెంట్ ఛానల్ వారు కూడా షాకవ్వడం విశేషం. ఈ సినిమా బుల్లితెరపై 5.8 టీఆర్పీ రేటింగ్‌ని మాత్రమే సాధించింది. దీంతో ఈ చిత్రం బుల్లితెరపై కూడా పరాజయం పాలైందని ప్రభాస్ అభిమానులు ఫీలవుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments