మిలియన్ల వ్యూస్‌తో రికార్డ్ సృష్టిస్తున్న ‘సాహో’ టీజర్...

  • IndiaGlitz, [Thursday,June 13 2019]

టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సాహో’ టీజర్ ఇవాళ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సాహోకు సంబంధించి ఏ చిన్నవార్త వచ్చినా డార్లింగ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే ఇవాళ ఇవాళ వచ్చిన టీజర్‌తో ఫ్యాన్స్ తమ అభిమానం అంటే ఏంటో చూపించేశారు. ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవద్ధుల్లేవ్. వాస్తవానికి బహుబలి తర్వాత ఈ ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నాడని ప్రకటించగానే ఇది భారీ ప్రాజెక్టు అని అంచనాలు కూడా భారీగానే ఉంటాయని అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఫస్ట్ లుక్, టీజర్ రాకతో ఆ అంచనాలు కాస్త డబుల్ అయిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బహుబలి కంటే ఎక్కువగానే హైప్ క్రియేట్ అవుతుందోని చెప్పుకోవచ్చు.

ఇక అసలు విషయానికొస్తే.. ఇవాళ రిలీజ్ అయిన ‘సాహో’ టీజర్‌కు ఒకట్రెండు కాదు ఏకంగా 6.3 మిలియన్ వ్యూస్ రావడం మామూలు విషయమేం కాదు. అంతేకాదు.. టీజర్ రిలీజైన కేవలం 6 గంటల్లోనే 2.5 కోట్ల వ్యూస్ వచ్చాయంటే ‘సాహో’ రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా.. గురువారం సాయంత్రానికి 6,760,624 వ్యూస్ రాగా.. 359K లైక్‌లు, 20K డిస్‌లైక్‌లు రావడం గమనార్హం. అయితే 23,379 కామెంట్స్ రాగా చాలా వరకు పాజిటివ్‌గానే వచ్చాయి.

కాగా.. ఈ టీజర్ గురించి పలువురు సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. దర్శకధీరుడు జక్కన రియాక్ట్ అవుతూ.. ‘టీజర్ టెర్రిఫిక్‌గా ఉంది.. యు.వి.క్రియేష‌న్స్‌ నిర్మాణ సంస్థ, ద‌ర్శకుడు సుజీత్ స‌మ న్యాయం చేశారు. ప్రభాస్ హ్యాండ్‌స‌మ్‌గా, డార్లింగ్‌లా క‌న‌ప‌డుతున్నారు’ అని రాజమౌళి చెప్పుకొచ్చారు.