దుబాయ్ పయనమౌతున్న 'సాహో'
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యువి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం సాహో`. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మితమౌతున్న ఈ త్రిభాషా చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయిక. ఇటీవల ఈ మూవీ.. హైదరాబాద్ షెడ్యూల్ చిత్రీకరణని పూర్తి చేసుకుంది. ఇక భారీ యాక్షన్ సన్నివేశాల కోసం వచ్చే నెల చివరిలో దుబాయ్ వెళ్లనుంది చిత్ర యూనిట్. దాదాపు రెండు నెలల పాటు అక్కడ ఈ యాక్షన్ సీన్స్‌ని చిత్రీకరిస్తారని సమాచారం.
ఇప్పటికే దుబాయ్ చేరుకోవలసిన చిత్ర బృందం...అక్కడ షూటింగ్ కోసం అనుమతులు రావడం ఆలస్యమవడంతో తమ షెడ్యూల్‌ని వచ్చే నెలకి వాయిదా వేసుకున్నారు. కాగా, ఈ యాక్షన్ సన్నివేశాలతో చిత్రీకరణ దాదాపుగా 50 శాతం పూర్తవుతుందని...సినిమాలో ఇవే ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. శంకర్-ఎహసాన్-లాయ్ స్వరాలను అందిస్తున్న ఈ మూవీని వచ్చే జనవరిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు వంశీ, ప్రమోద్ ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments