'సాహో' కథా నేపథ్యం ఏమిటంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘సాహో’. బాలీవుడ్ బ్యూటీస్ శ్రద్ధా కపూర్, ఎవెలిన్ శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, మందిరా బేడి, టీను ఆనంద్, మురళి శర్మ, అరుణ్ విజయ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో.. యు.వి క్రియేషన్స్ పతాకంపై ప్రమోద్, వంశీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అబుధాబిలో ఈ సినిమాకి సంబంధించి.. హైలైట్‌గా నిలిచిపోయే కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కథకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
అవేమిటంటే.. పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే సినిమా ఇదని.. ఇందులో ఓ సామాజిక సందేశం కూడా ఉంటుందని సమాచారం. కాగా.. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com