ఈద్‌కి 'సాహో' స్పెషల్ గిఫ్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
ఈద్.. ముస్లిం సోదరులు ఘనంగా చేసుకునే పండుగ. ఈ పండుగకు ముస్లిం సోదరులను ఖుష్ చేయాలని నిర్ణయించుకున్నారు ప్రభాస్. ఆయన నటిస్తున్న తాజా సినిమా `సాహో` టీజర్‌ను ఆ రోజు విడుదల చేయాలనుకుంటున్నారు. యువీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం `సాహో`. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఆగస్ట్ 15న విడుదల చేయాలన్నది ప్లాన్. ఈ మధ్య శంకర్-ఎహసాన్-లాయ్ ఈ సినిమా నుంచి తప్పుకుంటూ చెప్పిన వివరాల ప్రకారం ఇందులో ఇంకా పాటలను చిత్రీకరించలేదు.
శ్రద్ధాకపూర్ ఈ సినిమాలో నాయిక. ఆమెకు సంబంధించిన టాకీ పార్ట్ మాత్రం పూర్తయింది. సినిమా చాన్నాళ్లుగా మేకింగ్‌లో ఉండటం వల్ల, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా కొన్ని గ్లింప్సస్ని మాత్రమే విడుదల చేశారు. ఈద్ సందర్భంగా టీజర్‌ను విడుదల చేసి, అక్కడి నుంచి నెమ్మదిగా పబ్లిసిటీ పెంచాలని నిర్మాతల ప్లాన్ అట. మరోవైపు హిందీలో ఈద్ సందర్భంగా విడుదలవుతున్న సల్మాన్‌ఖాన్ `భారత్`తో పాటు సాహో టీజర్ ప్రదర్శితం కానుంది. సంగీత విభాగాన్ని జిబ్రన్కు అప్పగించాలని అనుకుంటున్నట్టు వినికిడి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com