ఈద్‌కి 'సాహో' స్పెష‌ల్ గిఫ్ట్

  • IndiaGlitz, [Thursday,May 30 2019]

ఈద్‌.. ముస్లిం సోద‌రులు ఘ‌నంగా చేసుకునే పండుగ‌. ఈ పండుగ‌కు ముస్లిం సోద‌రుల‌ను ఖుష్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు ప్ర‌భాస్‌. ఆయ‌న న‌టిస్తున్న తాజా సినిమా 'సాహో' టీజ‌ర్‌ను ఆ రోజు విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. యువీ క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం 'సాహో'. సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుగుతోంది. ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయాల‌న్న‌ది ప్లాన్‌. ఈ మ‌ధ్య శంక‌ర్‌-ఎహ‌సాన్‌-లాయ్ ఈ సినిమా నుంచి త‌ప్పుకుంటూ చెప్పిన వివ‌రాల ప్ర‌కారం ఇందులో ఇంకా పాట‌ల‌ను చిత్రీక‌రించ‌లేదు.

శ్ర‌ద్ధాక‌పూర్ ఈ సినిమాలో నాయిక‌. ఆమెకు సంబంధించిన టాకీ పార్ట్ మాత్రం పూర్త‌యింది. సినిమా చాన్నాళ్లుగా మేకింగ్‌లో ఉండ‌టం వ‌ల్ల‌, ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టిదాకా కొన్ని గ్లింప్స‌స్‌ని మాత్ర‌మే విడుద‌ల చేశారు. ఈద్ సంద‌ర్భంగా టీజ‌ర్‌ను విడుద‌ల చేసి, అక్క‌డి నుంచి నెమ్మ‌దిగా ప‌బ్లిసిటీ పెంచాల‌ని నిర్మాత‌ల ప్లాన్ అట‌. మ‌రోవైపు హిందీలో ఈద్ సంద‌ర్భంగా విడుద‌ల‌వుతున్న స‌ల్మాన్‌ఖాన్ 'భార‌త్‌'తో పాటు సాహో టీజ‌ర్ ప్ర‌ద‌ర్శితం కానుంది. సంగీత విభాగాన్ని జిబ్ర‌న్‌కు అప్ప‌గించాల‌ని అనుకుంటున్న‌ట్టు వినికిడి.