సువర్ణసుందరి నుంచి "సాహో సార్వ భౌమి" సాంగ్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న చిత్రం "సువర్ణసుందరి". ఈ సినిమాను సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి కార్తీక్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలొని "సాహో సార్వభౌమి" పాటను ఈ రోజు విడుదల చెశారు.
ఈ సందర్బంగా సాయి కార్తీక్ మాట్లాడుతూ.. సువర్ణసుందరి ఓ భారీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ . దర్శకుడు సూర్య ఆడియెన్స్ థ్రిల్ అయ్యేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా నా కెరీర్ లొ ఓ అత్యుత్తమ చిత్రం గా నిలిచి పొనుంది.
ఈ సినిమా లొని అన్ని పాటలు వేటికవే విభిన్నంగా ఉంటాయి.నాకు పర్సనల్ గా ఇష్టమైన "సాహొ సార్వభౌమి" పాట ఈ రొజు విడుదల చెస్తున్నారు. మ్యూజికల్ గా, విజువల్ గా ఉత్తమంగా వచ్చిన ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నానన్నారు.
జయప్రద,పూర్ణ, సాక్షిచౌదరి, రామ్, ఇంద్ర, సాయికుమార్, నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్ ఖాన్, అవినాష్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి, సంగీతం: సాయి కార్తిక్, ఎడిటింగ్: పవ్రీణ్ పూడి. నిర్మాత: ఎమ్.ఎల్.లక్ష్మి, దర్శకత్వం: సూర్య ఎమ్.ఎస్.ఎన్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments