సువర్ణసుందరి నుంచి 'సాహో సార్వ భౌమి' సాంగ్ 28న విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమా ఒరవడి మారింది. వైవిధ్యమైన సినిమాలకు ఆదరణ పెరిగింది.మన దర్శకులు సైతం సరికొత్త విధానాలతో సినిమాలను రూపొందిస్తున్నారు. అదే కోవలో నాలుగు జన్మలను మిళితం చేస్తూ రొలర్ కొస్టర్ స్ర్కీన్ ప్లే తో సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా "సువర్ణ సుందరి " తెరకెక్కుతోంది. సాయికార్తీక్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నుంచి " సాహో సార్వ భౌమి" అనే పాటను ఈ నెల 28న విడుదల చేస్తున్నారు.
జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న ఈ సినిమాను ఓ హిస్టారికల్ అడ్వెంచర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో వచ్చిన "సువర్ణ సుందరి " టీజర్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
జయప్రద,పూర్ణ, సాక్షిచౌదరి, రామ్, ఇంద్ర, సాయికుమార్, నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్ ఖాన్, అవినాష్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి, సంగీతం: సాయి కార్తిక్, ఎడిటింగ్: పవ్రీణ్ పూడి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments