'సాహో'.. ఫ్యాన్స్‌ కోసం సూపర్ ప్రోమో

  • IndiaGlitz, [Monday,April 02 2018]

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సాహో'. తెలుగుతో పాటు త‌మిళం, హిందీ భాష‌ల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోంది.

నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయక పాత్రలో నటిస్తుండగా.. అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడి, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

ఎమీ జాక్సన్ అతిథి పాత్రలో సందడి చేయనుంది. యు.వి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అబుధాబిలో చిత్రీకరణ జరుపుకుంటోంది ఈ చిత్రం. అక్కడ ప్రభాస్ అండ్ టీంపై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.ఈ యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేయడం కోసం చిత్ర యూనిట్ సినిమా ప్రోమోను సిద్ధం చేస్తోంద‌ని సమాచారం. ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే విధంగా ఈ సూపర్ ప్రోమోను రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.శంకర్ ఎహ్‌సాన్ లాయ్  సంగీతమందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

నాగ్‌, నాని మూవీ సెకండ్ షెడ్యూల్ అప్‌డేట్‌

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే

'రంగస్థలం 2' పై స్పందించిన సుకుమార్

ఈ శుక్ర‌వారం విడుదలైన 'రంగస్థలం' అన్ని సెంట‌ర్ల‌లోనూ విజయదుందుభి మోగిస్తోంది. రామ్ చరణ్, సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు.

ఏప్రిల్‌ 7న భరత్‌ బహిరంగ సభ

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో

శ్రుతి హాస‌న్ త‌రువాత స‌మంత‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌..

అదే మెగా ఫ్యామిలీ.. అదే నాగ్ ఫ్యామిలీ

20 ఏళ్ళ క్రితం విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన ప్రేమ‌క‌థా చిత్రం తొలిప్రేమ‌.