'సాహో'.. ఫ్యాన్స్ కోసం సూపర్ ప్రోమో
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సాహో'. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోంది.
నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయక పాత్రలో నటిస్తుండగా.. అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడి, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
ఎమీ జాక్సన్ అతిథి పాత్రలో సందడి చేయనుంది. యు.వి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అబుధాబిలో చిత్రీకరణ జరుపుకుంటోంది ఈ చిత్రం. అక్కడ ప్రభాస్ అండ్ టీంపై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.ఈ యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేయడం కోసం చిత్ర యూనిట్ సినిమా ప్రోమోను సిద్ధం చేస్తోందని సమాచారం. ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే విధంగా ఈ సూపర్ ప్రోమోను రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.శంకర్ ఎహ్సాన్ లాయ్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments